కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందిన సినిమా దేవర. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించారు. సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు చేశారు. ఈ నెల 27న విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. రీసెంట్ గా ముంబై లో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. అందులో సందీప్ రెడ్డి వంగాతో చేసిన ఇంటర్వ్యూ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ప్రోమో చివర్లో జాన్వీ కపూర్ దేవర హ్యూజ్ హిట్ అవుతుందని చెప్పిన మాట హైలెట్ గా మారింది.
ఇక త్వరలోనే తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 21 లేదా 22న ఈ ఈవెంట్ ఉండబోతోంది. మరి ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే ఎవరో ఒక చీఫ్ గెస్ట్ ఉండాలి కదా. రాజమౌళిని పిలిస్తే వస్తాడు. కానీ కొరటాల వెయిట్ తగ్గుతుంది. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబును పిలిచారు. మహేష్ కు కొరటాల అంటే ప్రత్యేకమైన గౌరవం. ఎన్టీఆర్ అంటే తమ్ముడు లాంటి ఇష్టం. అందుకే ఆల్మోస్ట్ మహేష్ బాబు ఓకే చెప్పాడు అని వినిపిస్తోంది. అందుకే మహేష్ ఫ్యాన్స్ కూడా కొరటాల మనకు శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు కాబట్టి దేవరను సపోర్ట్ చేద్దాం అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. సో.. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ బాబు చీఫ్ గెస్ట్ అనేది ఫిక్స్ అయిపోవచ్చంటున్నారు.
ఇక ఇక్కడ ఆ పెద్ద ఫంక్షన్ కాగానే వైజాగ్ లేదా విజయవాడలో మరో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఆ పై వరుసగా బెంగళూరు, కొచ్చి, చెన్నైలలో ప్రమోషనల్ ఫంక్షన్స్ ఉండబోతున్నాయి.