Hansika Motwani : హన్సిక విడాకులు అయిపోయింది

Update: 2026-03-11 11:06 GMT

హన్సిక మోత్వానీ.. హీరోయిన్ గా చాలా ఎర్లీ ఏజ్ లోనే స్టార్ట్ చేసింది. అదే చిన్న వయసులోనే పెద్ద స్టార్డమ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా స్టార్డమ్ అందుకుంది. కాకపోతే తెలుగు కంటే తమిళ్ ఆడియన్స్ లోనే కాస్త ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. సినిమా ఆఫర్స్ తగ్గిపోయిన తర్వాత తను హ్యాపీగా పెళ్లి చేసుకుంది. ఆమె భర్త పేరు సోహేల్ ఖతూరియా. ఇంకేముందీ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తుంది అని భావించారు. బట్ అలా ఏం జరగలేదు. తాజాగా ఆమె విడాకులు తీసుకుంది. ఆ విడాకులు ఈ రోజు (11.03.2026)న కోర్ట్ మంజూరు చేసింది. ఈ ఇద్దరికీ 2022 డిసెంబర్ 4న పెళ్లైంది. కేవలం రెండేళ్లకే ఇద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయి. ఆ కారణంగా 2024 జూలైలోనే ఈ ఇద్దరి సెపరేట్ గా ఉండిపోవడం మొదలైంది.

పెళ్లైన కొన్నాళ్లకే ఆ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. చాలా తక్కువ టైమ్ లోనే వీళ్లు విడిపోతారు అనే రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఆ రూమర్స్ ను ఖండించింది హన్సిక. మళ్లీ ఏమైందో రీసెంట్ గానే తన సోషల్ మీడియా అకౌంట్ లోని తన పెళ్లి ఫోటోస్ తో పాటు ఖతూరియాతో దిగిన ఫోటోస్ అన్నీ డిలీట్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య విడాకులు గ్యారెంటీ అని అంతా భావించారు. అంతా భావించినట్టుగానే ఇవాళ విడాకులు మంజూరు అయ్యాయి. మరి తన నెక్ట్స్ స్టెప్ ఏంటీ..? మరో పెళ్లికి సిద్ధం అవుతుందా లేక మళ్లీ సినిమాల్లోనే కొత్తగా కెరీర్ మొదలు పెడుతుందా అనేది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News