NTR : ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ సోషల్ మీడియా వార్

Update: 2025-08-04 09:19 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్ 2 ఈ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లోని స్పై మూవీస్ లో కనిపించే యాక్షన్ గ్రాండియర్ మరింత హై గా ఉండబోతోందని అర్థమయింది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ జరుగుతోంది. అతని పార్ట్ కూడా అంతా ఊహించినట్టు కాక నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని ట్రైలర్ తో తెలిసింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో నిర్మాణ సంస్థ నుంచి అనుకున్నంత స్థాయిలో దూకుడు కనిపించడం లేదు. కాకపోతే ఈ 10న విజయవాడలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.

ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేలా హీరోలిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒక వార్ మొదలుపెట్టారు. అయితే ఆ హ్యాష్ ట్యాగ్ వార్. తన పేరే ముందు ఉండాలని హృతిక్ రోషన్, కాదూ నా పేరే ముందుండాలి అని ఎన్టీఆర్.. ఇలా ఒకరినొకరు అనుకుంటూ పెట్టుకున్న ట్వీట్స్ వైరల్ గా మారాయి. చూడ్డానికి సరదగా ఉంది. ఇద్దరూ మేమే ముందు అంటూ చెప్పుకునేందుకు పడుతున్న ఆరాటం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం వీరి ట్వీట్స్ సోషల్ మీడియాలో బలే చక్కర్లు కొడుతున్నాయి. 

 

Tags:    

Similar News