Huma Qureshi : బంపర్ ఛాన్స్ కొట్టేసిన హుమా ఖురేషి..
Huma Qureshi : బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషి కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.;
Huma Qureshi : శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను గత సంవత్సం రిలీజ్ చేశారు. దిల్ రాజు దీనికి ప్రొడ్యూసర్. ఇది ప్యాన్ ఇండియా ఫిలిమ్ కావడంతో రిలీజ్ కావడానికి మరికొంత సమయం పడుతుంది. చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. అయితే బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషి కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. రాజకీయనాయకురాలి పాత్రలో ఆమె కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.
డైరెక్టర్ శంకర్ హుమా ఖురేషి పాత్రను చాలా బాగా డిజైన్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్‌లో పాపులర్ అయిన హుమా ఖురేషి.. టాలీవుడ్‌లో చరణ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కానుంది.