Ajith Kumar : అజిత్ నూ వదలని ఇళయరాజా

Update: 2025-04-15 10:15 GMT

ఇండియాస్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు ఇళయరాజా. ఆయన క్రియేట్ చేసిన మ్యూజికల్ మ్యాజిక్స్ ఎవర్ గ్రీన్. ఈ నేల ఉన్నంత కాలం ఇళయారాజా పాటలు ఉంటాయి. అందుకే ఆయన్ని సంగీత జ్ఞాని అంటున్నాం. అలాంటి జ్ఞానికి కొన్నాళ్లుగా కోపం వస్తోంది. అది కూడా తన పర్మిషన్ లేకుండా తన పాటలను వేరే సినిమాల్లో వాడుతున్నందుకు. కొన్నాళ్ల క్రితం ఎస్పీ బాలకసుబ్రహ్మణ్యం తన పాటలను వేర్వేరు మ్యూజికల్ కాన్సర్ట్స్ లో పాడుతున్నాడు అని రాయల్టీ కోసం ఆయనపైనా కేస్ వేశాడు. నిజానికి వీరిది 30యేళ్ల సంగీత బంధం. అలాంటి బాలుపైనే కేస్ వేశాడు అని తెలిసి చాలామంది రాజాపై కోప్పడ్డారు. తిట్టిపోశారు. బాలు లేకుండా ఈయన సంగీతం అంత గొప్పగా ఉండేదా అన్నారు. బట్ క్రియేట్ చేసింది రాజానే కదా. అందుకే కేస్ వేశాడు. తర్వాత రాజీ పడిపోయారు అది వేరే సంగతి.

ఇక రీసెంట్ గా మళయాల మూవీ మంజుమ్మేల్ బాయ్స్ లో గుణ చిత్రంలోని ప్రియతమా నేనిచట కుశలమే నీ వచట కుశలమా అనే పాటను వాడారని వారిపై కేస్ వేశాడు. వాళ్లూ సవాల్ చేశారు. కానీ తీర్పు రాజాకు అనుకూలంగా వచ్చింది. రాయల్టీ చెల్లించక తప్పలేదు. తాజాగా అజిత్ వంతు వచ్చింది. అజిత్ లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీలో రాజా కంపోజ్ చేసిన పాటలను వాడారు. అయితే ఇంత తెలిసిన తర్వాత కూడా వీళ్లూ ఆయన పర్మిషన్ లేకుండానే వాడేశారు. ఇంకేముందీ వెంటనే నోటీస్ లు పంపించాడు రాజా. తన పాటలు వాడినందుకు రాయల్టీ చెల్లించాలని ఆ నోటీస్ లలో పేర్కొన్నాడు. మరి గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో కానీ.. రాజా పాటలు ఇకపై ఎవరు వాడినా జాగ్రత్త పడాల్సిందే. ఆయన పర్మిషన్ తీసుకునే వాడితే ఇంకా మంచిది.

Tags:    

Similar News