డబ్బింగ్ సినిమాతో ఇతర భాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ రుక్మిణి వసంత్. కన్నడలో వచ్చిన సప్తసాగరాలు దాటి చిత్రంతో అందం, నటనతోనూ మెప్పించిన రుక్మిణికి తర్వాత తెలుగు, తమిళ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి.అటు కన్నడలో కూడా బిజీగా ఉంది.శాండల్ వుడ్ నుంచి 2023లో వచ్చిన కాంతార మూవీ దేశం మొత్తాన్ని ఊపేసింది. ఆ మూవీకి ప్రీక్వెల్ గా ఇప్పుడు మరో మూవీ రూపొందిస్తున్నాడు దర్శక, హీరో రిషబ్ శెట్టి. ఈ సారి అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ పాత్ర అక్కడితో ముగిసినట్టే. ఇది ప్రీక్వెల్ కాబట్టి ఈ చిత్రం కోసం రుక్మిణి వసంత్ ను హీరోయిన్ గా తీసుకున్నాడు రిషబ్.
ఈ చిత్రంలో తన పాత్ర పేరు కనకావతి. ఆమెను పరిచయం చేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రుక్మిణి మహారాణిలా మెరిసిపోతోంది. ఆ తరహా కట్టు బొట్టుతోనే కనిపిస్తోంది. చూడగానే స్పెల్ బౌండ్ అయ్యేలా ఉంది తన లుక్.కాంతారలో మహిళా పాత్రలకూ మంచి ప్రాధాన్యం ఉంది. ఈ సారి కూడా అది రిపీట్ అవుతుందనుకోవచ్చు.
హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 2న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.రిలీజ్ డేట్ గతంలోనే ప్రకటించారు. ఈ పోస్టర్ తో పాటు మరోసారి గుర్తు చేశారు.