Kiran Abbavaram : ప్యాన్ ఇండియన్ సినిమా కొందరికేనా..?

'క' సినిమా హీరో కిరణ్ అబ్బవరంపై విమర్శలెందుకు..;

Update: 2024-07-16 09:09 GMT

ప్యాన్ ఇండియన్ సినిమా అనే మాట ఎప్పుడైతే పాపులర్ అయిందో అప్పటి నుంచి అన్ని ఇండస్ట్రీల హీరోలు ఆ మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్యాన్ ఇండియన్ సినిమా అంటే ఏంటీ.. సింపుల్ గా చెబితే కథ యూనిక్ గా ఉండటం.. యూనివర్సల్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉండటం. ఇంతే. కాకపోతే ఆ విషయాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు అర్థమయ్యేలా.. ప్రమోషన్స్ కూడా చేసుకోవాలి. లేదంటే లాస్ తప్పదు. తెలుగు నుంచి దసరా, స్కంద వంటి సినిమాలను ప్యాన్ ఇండియన్ మూవీస్ అని ప్రచారం చేసినా.. ప్రమోషన్ లేక మిగతా చోట్ల ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఇంకా తనకంటూ ఓ రేంజ్ క్రియేట్ చేసుకోలేకపోయిన కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) కూడా ప్యాన్ ఇండియన్ సినిమా అంటున్నాడు. కానీ అతనిపై సెటైర్స్ పడుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం ఒకటైతే.. తన మార్కెట్ ను కూడా ప్రశ్నిస్తూ ఈ సెటైర్స్ వేస్తున్నారు. దానికి అతను దీటుగానే సమాధానం చెబుతున్నాడు.

నిజానికి ప్యాన్ ఇండియన్ మార్కెట్ ఒకరి సొత్తా..? ఫలానా వాళ్లే చేయాలని రూలేమైనా ఉందా.. ? అంటే ఖచ్చితంగా లేదు. అందుకే కిరణ్ అబ్బవరం ప్రయత్నిస్తున్నాడు. అది అతని కథపై ఉన్న నమ్మకం. ఆ నమ్మకం ప్రేక్షకులకూ కలిగితే సినిమా హిట్ అవుతుంది. అతను వైడ్ యాంగిల్ ఆడియన్స్ కు తెలుస్తాడు. లేదంటే తెలుగుకే పరిమితం అవుతాడు. అంతే కదా.. దీనికే అతనేదో తప్పు చేస్తున్నట్టుగానో, ఓవర్ చేస్తున్నాడు అనో అనుకుంటే ఎలా..?

కేజీఎఫ్ తో దేశాన్ని ఊపేసిన యశ్ ఆ మూవీకి ముందు కన్నడలో టైర్ టూ హీరో మాత్రమే. కాంతార హీరోకు అక్కడ మినిమం మార్కెట్ లేదు. అయినా దేశం మొత్తం మెప్పించాడు. అంటే కేవలం కంటెంట్ తో మాత్రమే వీళ్లు ఆ మార్కెట్ ను కొల్లగొట్టారు తప్ప.. ఆల్రెడీ ఉన్న తమ రేంజ్ వల్ల కాదు అనేది అందరికీ తెలుసు. అలాంటప్పుడు తెలుగు నుంచి ఓ కుర్రాడు తనూ ఓ కొత్త కథ చెబుతున్నాను అంటూ ప్యాన్ ఇండియన్ మార్కెట్ ను ట్రై చేస్తే అభినందించాల్సింది పోయి అడ్డగోలుగా మాట్లాడ్డం ఏం సంస్కారం అనిపించుకుంటుంది..?

ఏదేమైనా ఎవరి లక్ ఎక్కడుందో ఎవరూ చెప్పలేరు. ఏమో.. ఈ ‘క’ అనే సినిమాతో కిరణ్ కూడా ఓ పెద్ద హిట్ కొడతాడేమో.. ఒకవేళ కొట్టలేకపోతే మరో ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే కానీ.. ఇలా కించపరుస్తూ మాట్లాడితే ఏం బావుంటుంది.  

Tags:    

Similar News