Dulquer Salmaan : లక్కీ భాస్కర్ సైలెంట్ గా సత్తా చాటబోతున్నాడా

Update: 2024-10-30 04:23 GMT

కొన్ని సినిమాలు సైలెంట్ స్ట్రామ్స్ గా కనిపిస్తాయి. తుఫాన్ ముందు ప్రశాంతత లాగా అన్నమాట. ప్రస్తుతం టాలీవుడ్ లో లక్కీ భాస్కర్ పరిస్థితి అలాగే కనిపిస్తోంది. చూడ్డానికి భారీ ఓపెనింగ్స్ రావేమో అనిపిస్తోంది కానీ.. ప్రస్తుతం దీపావళి రేస్ లోస్ట్రాంగ్ గా కనిపిస్తోన్న మూవీ ఇదే అని టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. బలమైన కథ, కథనాలతో స్ట్రాంగ్ ఎమోషన్స్ తో చూసిన ప్రతి ఒక్కరినీ కట్టి పడేసే విధంగా రూపొందిందట ఈ మూవీ.

దుల్కర్ సాల్మన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి దర్శకుడు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

దుల్కర్ సినిమా అంటే ఖచ్చితంగా కథ వేరే స్థాయిలో ఉంటుంది. మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగులోనూ ప్రూవ్ చేసుకున్నాడతను. ఇది ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. అలాగే యూత్ తో పాటు అమ్మాయిల్లో కూడా అతనికి స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉంది. ప్రమోషన్స్ పరంగానూ ఆకట్టుకున్నారు. ఎక్కడా ఈ చిత్రం గురించి భారీగా హైప్స్ ఇవ్వడం లేదు కానీ.. సినిమా మాత్రం నెక్ట్స లెవల్లో ఉందనే టాక్ బలంగా ఉంది. అందుకే కాస్త లో ప్రొఫైల్ కూడా మెయిన్టేన్ చేస్తున్నారు అనే టాక్ ఉంది. మిడిల్ క్లాస్ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఇలాంటి సినిమా చూడలేదు అనేలా ఉంటుందట.

ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోన్న లక్కీ భాస్కర్ తో దుల్కర్ కు తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా స్టార్ట్ అవుతుందంటున్నారు. ఇటు మీనాక్షి చౌదరి ఇప్పటి వరకూ ఎక్కువగా సెకండ్ హీరోయిన్ గానే కనిపించింది. ఫస్ట్ టైమ్ తనకు ఓ మంచి అవకాశం ఇది. ఈ ఛాన్స్ ను అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఉపయోగించుకుంది అంటున్నారు. మొత్తంగా లక్కీ భాస్కర్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం అని.. ఓ సైలెంట్ స్ట్రామ్ క్రియేట్ చేస్తుందనే అయితే గట్టిగా ఉంది. మరి ఇది మాటలకే పరిమితమా.. సినిమా కూడా అలాగే ఉంటుందా అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది. 

Tags:    

Similar News