మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సెకండ్ పార్ట్స్ ను వదలడం లేదు. ఫస్ట్ పార్ట్ మూవీకి సెకండ్ పార్ట్ ను రూపొందించబోతున్నారు.ఆల్రెడీ దేవరకు రెండో భాగాన్ని వదలబోతున్నారు. కానీ ప్రశాంత్ నీల్ మూవీ విషయంలో కూడా సెకండ్ పార్ట్ ను రూపొందించబోతున్నాడు అనే వినిపిస్తోంది. యస్.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ విషయంలో రెండో భాగం కూడా వస్తోందని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్ సాగుతోంది. వైవిధ్యమైన కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ గెటప్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందించబోతున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ తో పాటు టోవినో థామస్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అనే టాక్ ఉంది. ఎన్టీఆర్ కు జోడీగా రుక్మిణి వసంత్ హీరోయిన్ తో నటించబోతన్నారు.
ఇక ఈ మూవీని రెండు భాగాలుగా రూపొందించబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు మూవీ టీమ్ కూడా చెబుతోందట. రెండు పార్ట్స్ ను చిత్రీకరించబోతున్నారు అంటున్నారు. అయితే ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తో తెరకెక్కించిన సలార్ 2 విషయంలో చేస్తున్న మిస్టేక్స్ ను కూడా ఈ విషయాన్ని చేయబోతున్నారు. సలార్ 2 చిత్రీకరణ బాగా లేట్ అవుతోంది. ఎన్టీఆర్ మూవీ విషయంలో రెండు భాగాలుగా మాత్రం బాగా లేట్ చేయడం లేదు. ఫస్ట్ పార్ట్ తరవాత రెండో భాగం విషయంలో వేగంగా చిత్రీకరణ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి అయితే రూమర్ గా వినిపిస్తోన్న న్యూస్. కాకపోతే రెండు భాగాలుగా మాత్రం గ్యారెంటీ అనేది మాత్రం ఖచ్చితంగా వినిపిస్తోంది.