Dil Raju : విచారణతో ఆగుతారా.. అరెస్ట్ వరకూ వెళతారా..?

Update: 2025-01-24 09:45 GMT

స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఇన్ని కలెక్షన్లు, అన్ని కలెక్షన్లు అంటూ భారీ అంకెలతో హంగామా చేయడం చాలాకాలంగా చూస్తున్నాం. కానీ అదే ఇప్పుడు టాలీవుడ్ కొంప ముంచింది అంటున్నారు. తాజాగా టాలీవుడ్ లో చాలామందిపై ఇన్ కమ్ టాక్స్ అధికారులు రైడ్ చేశారు. ఈ రైడ్స్ లో చాలా లూప్ హోల్స్ నే పట్టుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. లేదంటే ఈ పేపర్ ప్రకటనలు కావొచ్చు.. భారీ బడ్జెట్ తో సినిమాలు రూపొందించే వీరికి ఫండింగ్, ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది.. దానికి సంబంధించిన లెక్కలేంటీ అనే ఆరాలు డిపార్ట్ మెంట్ అధికారులు తీస్తున్నారు. గత మూడు రోజులుగా మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు, సుకుమార్ తో పాటు ఓ ఫైనాన్స్ వ్యాపారిపైన కూడా రైడ్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితమే దిల్ రాజు భార్య తేజస్వినిని ఆఫీస్ కు తీసుకువెళ్లి బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయించారు పోలీస్ లు. దిల్ రాజు ఫ్యామిలీ సభ్యులందరి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు.

ఇక మైత్రీ మూవీ మేకర్స్ అయితే పుష్ప 2 చిత్రానికి దాదాపు 2వేల కోట్లు వసూలయ్యాయి అని అదే పనిగా పోస్టర్స్ వదలడం వల్లే అధికారులకు అనుమానాలు పెరిగాయి అంటున్నారు. ఈ క్రమంలో మైత్రీ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ ను ఐటి ఆఫీస్ కు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. తాజాగా నవీన్ ను కూడా ఆఫీస్ కు తీసుకువెళ్లారు అంటున్నారు.

ఇవాళ(శుక్రవారం) దిల్ రాజును కూడా ఐటీ ఆఫీస్ కు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. అయితే వీరిని కేవలం విచారణ కోసమే పిలిచారా లేక అరెస్ట్ ల వరకూ వెళతారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరికి వాళ్లు మేం ఏ తప్పూ చేయలేదు అని చెబుతున్నా.. ఈ నిర్మాణ సంస్థల నుంచి విచ్చలవిడిగా బ్లాక్ మనీ సర్క్యులేట్ అయినట్టు పక్కా సమాచారం, ఆధారాలతోనే అధికారులు దాడులు నిర్వహించారనేది బలంగా వినిపిస్తోంది. మొత్తంగా ఇవాళ్టితో సోదాలు ముగిసిపోతాయని.. విచారణ తర్వాత అరెస్టా లేక ఇంకేదైనానా అనేది త్వరలోనే తెలుస్తుందీ అంటున్నారు. 

Tags:    

Similar News