Siddhu Jonnalagadda : జాక్ టీజర్ తో అదరగొట్టిన సిద్ధు

Update: 2025-02-07 13:45 GMT

జొన్నలగడ్డ సిద్ధు లేటెస్ట్ మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఇవాల సిద్ధు బర్త్ డే స్పెషల్ గా ఈ టీజర్ విడుదల చేశారు. దీని కోసం చాలామంది ఈగర్ గా ఎదురుచూస్తున్నారు కూడా. డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన సిద్దు ఈ మూవీతో హ్యాట్రిక్ కంప్లీట్ చేయబోతున్నాడని టీజర్ తోనే ఫిక్స్ అయిపోవచ్చు అనేలా ఉంది. జాక్.. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. జాక్ లో సిద్దు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్ వెరీ ఇంప్రెసివ్ అనేలా ఉంది. ఫస్ట్ సగం ఫన్, నెక్ట్స్ సగం వయొలెన్స్ తో బలే ఉంది.

టీజర్ చూస్తే.. ‘నా ప్రాబ్లమ్ పేరు పాబ్లో నెరూడా’ అని నరేష్ అంటే.. ‘పాబ్లో నెరూడా.. చెలియన్ పోయొట్’ అని బ్రహ్మాజీ బదులివ్వడం.. తర్వాత హీరోయిన్ హీరోతో.. ‘నువ్వు బైక్ లు కొట్టేస్తావా అంటే.. అదంతా పార్ట్ టైమ్ అంతే అంటాడు.. ఏంటీ నువ్వు జేబు దొంగవా అంటే అప్పుడప్పుడూ అంటాడు. మరి ఈ బట్టలేంటీ.. ఏదో జాబ్ చేసుకునేవాడిలా అని అడిగితే.. ఇదుగో నీలాగే.. కనిపించిన ప్రతిఒక్కడు ఏం చేస్తున్నావ్ ఎక్కడ చేస్తున్నావ్ అని దొబ్బుతున్నడు.. అందుకే ఇట్టాంటి బట్టలేసుకుని ఐడీ కార్డేసుకుంటే నోర్మూసుకుంటరని..’ అంటాడు సిద్దు. ఇలా ప్రతి డైలాగ్ ఫన్ ఉంటూనే ఇమ్మీడియొట్ గా వయొలెంట్ వర్షన్ లోకి మారుతుంది. టీజర్ చివర్లో.. వైష్ణవి చైతన్య.. ‘నాకో లవ్ స్టోరీ ఉంది’ అంటుంది.. దానికి సిద్ధు ఛీ దీనమ్మ దరిద్రం మళ్లీ మొదలైంది.. అంటాడు. మొత్తంగా తన కొడుకు ఏం జాబ్ చేస్తున్నాడో అర్థం కాని తండ్రి ఫ్రస్ట్రేషన్ తో మొదలై.. తను ప్రేమించిన అమ్మాయికి లవ్ స్టోరీ ఉందనే వరకూ టీజర్ ఆసాంతం ఆకట్టుకునేలానే ఉంది.

ఇక బీవిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ మూవీకి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు టీజర్ తో పాటు అనౌన్స్ చేశారు. 

Full View

Tags:    

Similar News