JR NTR Fans : జూబ్లీహిల్స్‌లోని ఎన్టీఆర్ ఇంటి వద్ద అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా
JR NTR Fans : జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అర్ధరాత్రి ఆయన ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే నేపథ్యంలో హైదరాబాద్‌కు భారీగా అభిమానులు తరలివచ్చారు.;
JR NTR Fans : జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అర్ధరాత్రి ఆయన ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే నేపథ్యంలో హైదరాబాద్‌కు భారీగా అభిమానులు తరలివచ్చారు. జూబ్లీహిల్స్‌లోని తారక్ ఇంటి దగ్గర అత్యుత్సాహం ప్రదర్శించారు. తారక్ ఇంటి ముందు కేక్ కట్ చేసి.. జై ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తించారు. డ్యాన్సులతో రచ్చ చేశారు.
ఎన్టీఆర్ బయటకు రావాలని నినాదాలు చేశారు. అర్ధరాత్రి కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్లరితో స్థానికులు ఇబ్బంది పడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అభిమానులను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. ఆయినా ఫ్యాన్స్ పోలీసుల మాట వినకపోవడంతో లాఠీలను ఝులిపించారు.
కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు లాఠీలకు పని చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.