Kajal Aggarwal: కాజల్ ఇంట సీమంతం వేడుకలు.. ఫోటోలు వైరల్
Kajal Aggarwal: కాజల్.. గౌతమ్‌తో కలిసి పోజులిచ్చిన మధురమైన చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.;
Kajal Aggarwal: పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ తెలుగువారి హృదయాలను దోచుకున్న చందమామ. గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తోంది.. త్వరలో ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఆమెకు ఆదివారం సీమంతం వేడుకలు జరిగాయి.
ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాజల్ సింధూరం రంగు చీరలో అందంగా ముస్తాబైతే, ఆమె భర్త కుర్తా-పైజామా ధరించి సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన సీమంతం వేడుకల్లో పాల్గొన్నారు. కాజల్.. గౌతమ్‌తో కలిసి పోజులిచ్చిన మధురమైన చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
కాజల్ న్యూ ఇయర్ 2022 నాడు తాను గర్భం దాల్చినట్లు ప్రకటించింది. ఈ జంట ఈ సంవత్సరం తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నామని అభిమానులకు తెలియజేయడానికి వారి పోస్ట్ క్యాప్షన్‌లో గర్భిణీ స్త్రీ ఎమోజీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తర్వాత, కాజల్ తన బేబీ బంప్ ఫోటోను షేర్ చేసింది. అక్టోబర్ 2020 లో ముంబైలో వివాహం చేసుకున్నారు.
కాగా, కాజల్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్యలో చిరంజీవితో కలిసి నటించింది. బృందా దర్శకత్వంలో వస్తున్న తమిళ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌తో కాజల్ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ చిత్రంలో మరో నటి అదితి రావ్ హైదరీ కూడా కనిపించనుంది.