Kangana Ranaut : కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ'కి షాక్

Update: 2024-09-05 09:45 GMT

కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుని తాము ఆదేశించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, సెప్టెంబర్ 18లోపు ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డుకి సూచించింది.

వాస్తవంగా సెప్టెంబర్ 6న ఈ చిత్రం విడుదల కావాల్సివుంది. సెన్సార్ సర్టిఫికెట్ రాకుంటే. విడుదల తేదీ వాయిదా పడే అవకాశాలున్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎమర్జెన్సీ కథానాయికగా కంగనా ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం ఆమె స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలకపాత్రలు పోషించారు. సినిమాలో తమను కించపరిచేలా చూపించారని, విడుదలను అడ్డుకోవాలని ఓవర్గం మధ్యప్రదేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

దీనిపై విచారణ జరిపిన కోర్టు, వారి వాదనల్ని పరిగణనలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకి సూచించింది. మరోవైపు సినిమా విడుదలను నిలిపివేయాలని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) పార్టీ కూడా సెన్సార్ బోర్డుని కోరింది.

Tags:    

Similar News