రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన కాంతార దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా 350 కోట్ల వరకూ వసూలు చేసి రికార్డులు సృష్టించింది. దీంతో ఈ మూవీకి ప్రీక్వెల్ గా అదే బ్యానర్ నుంచి రిషబ్ కాంతార చాప్టర్ 1 అంటూ మరో సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సారి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందీ సినిమా. ఈ యేడాది దసరా సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు. హొంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం కళ్లు చెదిరే ధర చెబుతున్నారు. ఇంకా చెబితే రీసెంట్ గా వచ్చిన ఎన్టీఆర్ మూవీ వార్ 2 కంటే కూడా ఈ మూవీకే ఎక్కువ రేట్ చెబుతున్నారు.
కాంతార చాప్టర్ 1 కోసం తెలుగు రైట్స్ ను ఏకంగా 100 కోట్లు చెబుతున్నారట. నైజాం్ 40 కోట్లు, ఆంధ్ర 45, సీడెడ్ 15 కోట్లుగా నిర్ధారించి మరీ రేట్ చెబుతున్నారట. ఈ మూవీకి తిరుగులేని క్రేజ్ ఉంది. కానీ ఫస్ట్ పార్ట్ బడ్జెట్ వల్ల హిట్ కాలేదు. కేవలం కంటెంట్ అన్ని భాషల్లోనూ కనెక్ట్ అవడం వల్ల విజయం సాధించింది. ఈ సారి భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ను జోడించాం అంటున్నారు. కానీ కంటెంట్ ఉన్న సినిమాకు ఇవన్నీ అవసరం లేదు అనేది అందరికీ తెలుసు. ఏదేమైనా 100 కోట్లు అంటే మరీ టూ మచ్ అనే చెప్పాలి. అలాగని వాళ్లు చెప్పినంతకు ఎవరూ కొనరు. సో.. వాళ్లు 100 అన్నారు కాబట్టి.. మనవాళ్లు ఓ 60 - 70 కోట్ల మధ్య డీల్ ఫినిష్ చేస్తారేమో. కానీ ఏ చిన్న తేడా వచ్చినా కొన్నవాళ్లంతా అడ్డంగా మునిగిపోవడం మాత్రం ఖాయం.