KIMS Hospital : సిరివెన్నెలను బ్రతికించాలని ఎంతో ప్రయత్నించాం : కిమ్స్ ఎండీ
KIMS Hospital : సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరని చెప్పడానికి తామెంతో బాధ పడుతున్నామని కిమ్స్ ఆస్పత్రి ఎండీ భాస్కర్‌రావు అన్నారు.;
KIMS Hospital : సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరని చెప్పడానికి తామెంతో బాధ పడుతున్నామని కిమ్స్ ఆస్పత్రి ఎండీ భాస్కర్‌రావు అన్నారు. సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారని తెలిపారు. సిరివెన్నెలను బతికించేందుకు శాయాశక్తులా ప్రయత్నించామని, ఆయన బాడీ కూడా సపోర్ట్ చేసిందన్నారు. కానీ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువయ్యాయని కిమ్స్ ఆస్పత్రి ఎండీ భాస్కర్‌రావు తెలిపారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.