యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేసిన మూవీ దేవర. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ను ఈ నెల 27న విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తో ప్యాన్ ఇండియ స్టార్ అన్న ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆ ఇమేజ్ ను నిలబెట్టుకోవాలంటే.. దేవర బ్లాక్ బస్టర్ కావాలి. కానీ ఈ మూవీపై ఏ దశలోనూ హిట్ వైబ్స్ క్రియేట్ కాలేదు. ఎక్కడా పాజిటివ్ టాకే వినిపించడం లేదు. ట్రైలర్ తో అన్నీ మారతాయనుకున్నారు. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత దేవర కూడా పాదఘట్టమే అని అంతా ఫిక్స్ అయిపోయారు అనేలా వస్తున్నాయి ట్రోల్స్. ఇందుకు ప్రధాన కారణం కొరటాల శివ అనే చెప్పాలి. పేలవమైన ట్రైలర్ తో పాటు అంతకు మించిన నీరసంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కనిపించింది. విఎఫ్ఎక్స్ తేలిపోయాయి. గ్రాఫిక్స్ బాలేదు అన్న టాక్ వచ్చింది. ఎలా చూసినా అన్ని వైపుల నుంచి ఈ చిత్రంపై నెగెటివ్ టాకే వినిపిస్తోంది.
ఇక ప్రమోషన్స్ పరంగా ఏమైనా కొత్తదనం ఉందా అంటే అస్సలు లేదు. పైగా ఈ విషయంలో కొరటాల ఆచార్య ఫార్మాట్ నే ఫాలో అవుతున్నాడు.
కొందరు దర్శకులను తీసుకు వచ్చి, లేదంటే ఆర్టిస్టులను తెచ్చి ఆచార్య ఇంటర్వ్యూస్ చేయించాడు. ఆ ఇంటర్వ్యూస్ లో ఒక్కటి కూడా ఆకట్టుకోలేదు. ఇప్పుడూ అదే చేస్తున్నాడు. సందీప్ రెడ్డి, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లతో ప్రమోషన్స్ చేయిస్తున్నారు. సందీప్ ఇంటర్వ్యూ పైనా విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇష్టం లేకపోయినా అతనితో ఇంటర్వ్యూ చేయించినట్టుగా కనిపిస్తున్నాయీ ట్రోల్స్. దీనికి ఇంటర్వ్యూ మధ్యలో సందీప్ ఎక్స్ ప్రెషన్స్ జోడించి పరమ బోరింగ్ ఇంటర్వ్యూ అన్నట్టుగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఇక ఆచార్యలో తండ్రి కొడుకులు కలిసి నటించినా కాంబినేషన్ ఫెయిల్ అయింది. దేవరలో కూడా ఎన్టీఆరే చేసినా.. తండ్రి కొడుకులుగా నటించారు ఇక్కడా ఆచార్య రిజల్ట్ రిపీట్ అవుతుందని సెంటిమెంట్స్ ను జోడిస్తున్నారు. ఏదేమైనా సినిమా కంటెంట్ పరంగా ఇప్పటికే మైనస్ మార్క్ లు తెచ్చుకుంది. కనీసం ప్రమోషన్స్ లో అయినా కొత్తదనం ఉంటుందా అంటే అదే ఆచార్య.. అదే పాదఘట్టం అన్నట్టుగా ఉంది కొరటాల వ్వవహారం అని ఫ్యాన్స్ కూడా తెగ ఫీలవుతున్నారు.