Lakshmi Pranathi: ట్విటర్‌లోకి ఎన్‌టీఆర్ భార్య ఎంట్రీ.. ఫస్ట్ పోస్ట్ భర్త గురించే..
Lakshmi Pranathi: ఇప్పటివరకు సోషల్ మీడియాకు, లైమ్‌లైట్‌కు దూరంగా ఉన్న ప్రణతి ఒక్కసారిగా ట్విటర్‌లో అడుగుపెట్టింది.;
Lakshmi Pranathi: ఆన్ స్క్రీన్ యాక్టివ్‌గా ఉండే చాలామంది నటీనటులు తమ పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా అందరితో షేర్ చేసుకోరు. అలాగే చాలామంది స్టార్ హీరోల భార్యలు కూడా ఎక్కువగా లైమ్‌లైట్‌లోకి రావడానికి ఇష్టపడరు. టాలీవుడ్‌లోని స్టార్ హీరోల భార్యలు చాలా తక్కువమంది మాత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆ లిస్ట్‌లోకి ఎన్‌టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి కూడా జాయిన్ అయ్యింది.
ఎన్‌టీఆర్ అంటే పేరు కాదు అది ఒక బ్రాండ్ అనేలాగా ల్యాండ్‌మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం తన చేతిలో ఉన్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే. అంతే కాకుండా రామ్ చరణ్‌తో కలిసి ఎన్‌టీఆర్ నటిస్తున్న మల్టీ స్టారర్ 'ఆర్ఆర్ఆర్' కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే తన భార్య లక్ష్మి ప్రణతి ట్విటర్‌లో అడుగుపెట్టింది.
లక్ష్మి ప్రణతి ఇప్పటివరకు పెద్దగా బయటికి వచ్చింది లేదు. పెళ్లయిన కొత్తలో ఎన్‌టీఆర్‌తో కలిసి తన సినిమాల ఫంక్షన్లకు వచ్చే ప్రణతి.. కొన్నాళ్లకు అది కూడా మానేసింది. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫోటోస్‌లో కనిపిస్తుంటుంది ప్రణతి. అలాంటి తను తాజాగా ట్విటర్‌లో అకౌంట్‌ను ఓపెన్ చేసుకుంది. అంతే కాకుండా మొదటి పోస్ట్‌గా తన భర్త ఎన్‌టీఆర్‌తో దిగిన ఫోటోను పెట్టింది.
ఇప్పటివరకు సోషల్ మీడియాకు, లైమ్‌లైట్‌కు దూరంగా ఉన్న ప్రణతి ఒక్కసారిగా ట్విటర్‌లో అడుగుపెట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 'మీ అందరితో కలిసి ట్విటర్‌లో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నా మొదటి ట్వీట్ నా లవ్లీ భర్తతో పోస్ట్ చేస్తున్నాను' అంటూ ప్రణతి తన భర్త ఎన్‌టీఆర్‌ను ట్యాగ్ చేసింది. లక్ష్మి ప్రణతి ట్విటర్‌లో అడుగుపెట్టి 24 గంటలు తిరగకుండానే 3000కు పైగా ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది.
Happy to join Twitter with You all! Posting my First tweet with my lovable husband @tarak9999 #NTR. pic.twitter.com/2vQNuuLVDJ
— Lakshmi Pranathi (@LakshmiNTR_) January 27, 2022