Pooja Hegde : కోలీవుడ్ లో పాగా వేయబోతోన్న పూజాహెగ్డే

Update: 2025-07-05 07:30 GMT

తెలుగులో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది పూజాహెగ్డే. గుంటూరు కారం నుంచి తన లక్ అడ్డం తిరిగింది. అప్పటి నుంచి తెలుగులో సినిమాల్లేక ఇబ్బంది పడుతోంది. అదే టైమ్ లో కోలీవుడ్ లో పాగా వేసే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సూర్య సరసన రెట్రోతో సూపర్ ఆఫర్ అందుకుంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీతో తనకు బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనుకుంది. బట్ రెట్రో అన్ని భాషల్లోనూ యూనానిమస్ డిజాస్టర్ గా నిలిచింది. అదే టైమ్ లో రిజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తోన్న కూలీ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసింది పూజా హెగ్డే. మరోవైపు దళపతి విజయ్ సరసన జన నాయగన్ తో నే హీరోయిన్. అయితే ఈ మూవీతో తనకు పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. విజయ్ లాస్ట్ మూవీ కాబట్టి అతని కేంద్రంగానే ఆ సినిమా ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. ఇక రాఘవ లారెన్స్ కాంచన 4లోనూ ఛాన్స్ కొట్టేసింది. తాజాగా తమిళ్ లోనే మరో క్రేజీ ఆఫర్ అందుకుంది అనే టాక్ వినిపిస్తోంది.

ఆ మధ్య పోర్ తొళిళ్ అనే థ్రిల్లర్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ధనుష్ ఓ మూవీ చేయబోతున్నాడు. ఆల్రెడీ ఆ కాంబోలో మూవీ కన్ఫార్మ్ అయింది. ఇది కూడా థ్రిల్లర్ తరహాలోనే సాగే సినిమా. ఈ చిత్రంలోనే ధనుష్ సరసన పూజాహెగ్డేను తీసుకున్నారు అనే టాక్ కోలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ధనుష్ సరసన పూజా హెగ్డే ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే అంటున్నారు. ఇవి కాక హిందీలో మరో రెండు సినిమాలు చేస్తోంది. సో.. తెలుగులో ఏం లేకపోయినా కోలీవుడ్ లో పాగా వేసేలా పావులు కదుపుతోంది. హిందీలో ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉంది.

Tags:    

Similar News