Trisha : ఈ ఫ్రైడే ‘ఐడెంటి’దేనా

Update: 2025-01-22 12:30 GMT

టాలీవుడ్ లో మరో మళయాల సినిమాకు బంపర్ ఆఫర్ వచ్చింది. ఈ 24న విడుదల కాబోతోన్న సినిమాల్లో ఏదీ పెద్దగా ఆకట్టుకునేలా లేదు. నిజానికి అస్సలు సినిమాలే లేవు అనుకున్నారు కానీ.. ఆంధ్రప్రదేశల్ లో జరిగిన ఓ రాజకీయ నాయకుడి హత్య కేస్ ప్రధానంగా తలపిస్తూ రూపొందిన హత్య అనే సినిమాతో పాటు గాంధీ తాత చెట్టు అనే మూవీ విడుదల కాబోతున్నాయి. గాంధీ తాత చెట్టులో దర్శకుడు సుకుమార్ కూతురు ప్రధాన పాత్రలో నటించింది. ఇదే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. కానీ కంటెంట్ పరంగా చూస్తే ఇదో అవార్డ్స్ మూవీలా ఉందనే కామెంట్స్ ఉన్నాయి. థియేటర్స్ లో జనాన్ని కూర్చోబెట్టే సత్తా ఉన్న చిత్రంగా కనిపించడం లేదు అనేది ఈ మూవీపై వస్తోన్న కంప్లైంట్. ఇక ప్రేమలు చిత్రంతో ఆకట్టుకున్న మమితా బైజు నటించిన అనే ట్యాగ్ లైన్ తో డియర్ కృష్ణ అనే కన్నడ సినిమాను తెలుగులో డబ్ చేసి 24న విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ చూస్తే చాలా లో క్వాలిటీతో కనిపిస్తోంది. మమితకు సైతం ట్రైలర్ లోనే పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఇక మిగిలింది మళయాల డబ్బింగ్ మూవీ ఐడెంటిటీ.

ఐడెంటిటీ లో టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. మళయాలంలో జనవరి 1న విడుదలైన ఐడెంటిటీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. మంచి థ్రిల్లర్ అనిపించుకుందీ మూవీ. ఆర్టిస్టుల పరంగా త్రిష ఒకప్పుడు ఇక్కడ టాప్ హీరోయిన్. టోవినో కూడా అప్పుడప్పుడూ డబ్బింగ్ మూవీస్ తో పరిచయం ఉన్నవాడే. దీనికి తోడు ఈ మధ్య మళయాల డబ్బింగ్ మూవీస్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇదీ ఓ కారణంగ ఈ చిత్రానికి కలిసొచ్చే అవకాశం ఉంది. ఎలాగైతే తెలుగులో 2025 ఫస్ట్ డేనే మార్కో అనే మళయాల మూవీ మంచి విజయం సాధించిందో.. అంతకు మించిన విజయం సాధించే అవకాశం ఐడెంటిటీకి ఉందని చెప్పాలి. సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలే కాదు.. మీడియం రేంజ్ సినిమాలు కూడా లేవు. సంక్రాంతి మూవీస్ ను ఆల్రెడీ చూసేశారు జనం. సో.. ఐడెంటికీకి ఇది మంచి అవకాశం. కంటెంట్ తెలుగు వారికీ కనెక్ట్ అయితే ఇక్కడా కాసులు కురుస్తాయి. అందుకే ఈ వారం ఐడెంటిటీదే అని ముందుగానే అనేస్తున్నారు జనం. 

Tags:    

Similar News