Mamitha Baiju : బర్త్ డేతో టూ బిజీ అనిపించుకున్న బ్యూటీ

Update: 2025-06-23 08:39 GMT

ప్రస్తుతం ఒక భాషలో బ్లాక్ బస్టర్ అందుకుంటే చాలు.. అన్ని భాషల నుంచి ఆఫర్స్ వస్తుంటాయి. అఫ్ కోర్స్ ఇది కేవలం హీరోయిన్లకు సంబంధించిన మేటర్. అలా ప్రేమలు మూవీతో ఓవర్ నైట్ సౌత్ మొత్తం ఫేమ్ అయిన మళయాల బ్యూటీ మమిత బైజు. ఈ సినిమాతో తెలుగు వారికి సైతం బాగా దగ్గరయింది. అందం, టాలెంట్ రెండూ మెండుగా ఉన్న ఈ బ్యూటీకి ప్రేమలు తర్వాత తెలుగు, తమిళ్ నుంచి వరుస ఆఫర్స్ వచ్చాయి. నిన్న(ఆదివారం) తన బర్త్ డే. ఆ సందర్భంగా తను నటిస్తోన్న సినిమాల నుంచి వచ్చిన కొత్త పోస్టర్స్ చూస్తే అమ్మడు ఎంత బిజీ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే అదే రోజు తమిళ్ స్టార్ విజయ్ బర్త్ డే కూడా ఉండటంతో మమిత మరింత షైన్ కాలేకపోయింది.

ఇక ప్రస్తుతం మమిత తెలుగులో సూర్య సరసన నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న సినిమా. ఈ మూవీలో హీరోయిన్ కోసం చాలామందిని చూశాక మమితను ఫైనల్ చేశారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో లేటెస్ట్ కోలీవుడ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ తో ‘డూడ్’అనే సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలూ తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఏక కాలంలో రూపొందుతుండటం విశేషం. అంటే ఒకే సినిమాతో రెండు భాషల ప్రేక్షకులకు దగ్గర కాబోతోందన్నమాట. అలాగే దళపతి విజయ్ హీరోగా నటిస్తోన్న జన నాయకుడు చిత్రంలో తను ఓ కీలక పాత్ర( హీరోయిన్ కాదు) చేస్తోంది. ఈ మూడు సినిమాల నుంచి తనకు బర్త్ డే విషెస్ చెబుతూ కొత్త పోస్టర్స్ వచ్చాయి. ఇవే కాక తమిళ్ లో రామ్ కుమార్ దర్శకత్వంలో విష్ణు విశాల్ సరసన ‘ఇరండు వానమ్’అనే చిత్రంలో నటిస్తోంది. మొత్తంగా తన బర్త్ డే సందర్భంగా మమిత ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో ఎంత బిజీగా ఉందో తెలిసిపోయింది. విశేషం ఏంటంటే.. ఈ మూడూ ప్రామిసింగ్ మూవీస్ గానే ఉన్నాయి. సో.. రెండు బ్లాక్ బస్టర్స్ అయినా అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళుతుంది.

Tags:    

Similar News