Meenakshi Chaudhary : అన్ లక్కీ మీనాక్షి

Update: 2024-11-16 07:01 GMT

ఇట్టా హిట్టు పడిందో లేదో.. ఆ ఆనందం రెండు వారాలు కూడా నిలవలేదు. మీనాక్షి చౌదరి ఫస్ట్ పిక్చర్ డిజాస్టర్. నెక్ట్స్ మూవీ ఖిలాడీ కూడా పోయినా.. హిట్ 2 మూవీతో విజయం దక్కింది. త్రివిక్రమ్ అమ్మడిలోని స్పార్క్ ను గమనించాడు. కట్ చేస్తే గుంటూరు కారం, అటు గోట్ ఇలా పెద్ద సినిమాలు పడ్డాయి కానీ తనకేం ఉపయోగపడలేదు. అయినా మీనాక్షికి సెపరేట్ ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయిందంటే ఆశ్చర్యమే. అఫ్ కోర్స్ అమ్మడి కటౌట్ కు ఆ రేంజ్ ఉంది. అక్టోబర్ 31న విడుదలైన లక్కీ భాస్కర్ తో పెద్ద విజయం అందుకుంది. ఇందులో తన నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. ఇంకేం.. ఇక కెరీర్ గాడిలో పడింది అనుకునే లోపే.. రెండు వారాల్లోనే మట్కా అంటూ మరో డిజాస్టర్ పడింది.

మట్కాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆ క్యారెక్టర్ డిజైనింగే సరిగా లేదు. ఇక ఎండింగ్ అయితే మరీ పూర్ గా ఉంది. అసలు తను సినిమాలో ఉందా అంటే కూడా ఆశ్చర్యమే అన్నంత తీసికట్టుగా ఆ పాత్రను రాసుకున్నాడు దర్శకుడు. ఈ ఫ్లాప్ తో తన కెరీర్ ముగిసిపోతుంది అని కాదు. మళ్లీ నెక్ట్స్ వీక్ మెకానిక్ రాకీ ఉన్నాడు. అది కూడా తేడా కొడితే అప్పుడు ప్రమాదంలో పడుతుంది. పైగా ఆ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కూడా మరో హీరోయిన్ గా నటించింది. ఏదేమైనా అందం, టాలెంట్ రెండూ ఉన్నా.. లక్ లేక అన్ లక్కీ మీనాక్షి అనిపించుకుంటోంది ఈ హర్యానా అందం.

Tags:    

Similar News