Pathan Controversy: సినిమాల్లో అశ్లీలత ఎక్కువైంది.. సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వకూడదు: ముకేశ్ ఖన్నా
Pathan Controversy: పఠాన్ చిత్రంలోని బేషరమ్ రంగ్ సాంగ్‌పై రగడ కొనసాగుతుంది. ముకేశ్ కన్నా మరోసారి స్పందించారు.;
Pathan Controversy: పఠాన్ చిత్రంలోని బేషరమ్ రంగ్ సాంగ్‌పై రగడ కొనసాగుతుంది. ముకేశ్ కన్నా మరోసారి స్పందించారు. ఆ పాటలో హీరోయిన్ దీపికా పదుకొణె ధరించిన స్విమ్ సూట్ మత విశ్వాసాలను దెబ్బతీసిందన్న ఆయన.. దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ని కోరారు. ఈ సినిమా 2022 డిసెంబరులో విడుదలైనప్పటి నుంచే ఈ పాట విజువల్స్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీపికా ధరించిన బికినీ రంగును తప్పుబడుతూ కొంతమంది రాజకీయ నాయకులు, సినీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ పలువురు డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ సినిమాలోని పలు సన్నివేశాలు, సాంగ్స్‌లోని కొన్ని విజువల్స్‌పై సెన్సార్ బోర్డు ఇటీవల అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటిని వెంటనే తొలగించాలని సూచించిన బోర్డు.. తాము చెప్పిన విధంగా సినిమాలో మార్పులు చేసిన తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ కోసం రావాలని ఆదేశించింది.
ఈ పరిణామాలపై తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు ముకేశ్ ఖన్నా. బేషరమ్ రంగ్‌లోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని సీబీఎఫ్‌సీ పఠాన్ చిత్ర బృందానికి సూచించిందని సమాచారం అందిందన్నారు. ఈ విషయంలో సెన్సార్ బోర్డు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నానని పేర్కొన్నారు.
సెన్సార్ బోర్డు లిరిక్స్ మార్చాలని చెబితే సరిపోదని.. అభ్యంతరకరమైన సన్నివేశాలనూ మార్పించాలన్నారు. బాయ్‌కాట్‌కు తాన మద్దతిస్తానని పేర్కొన్నారు. అప్పుడు ఏ నిర్మాతా భవిష్యత్‌లో ఇలా చేసేందుకు ధైర్యం చేయరన్నారు. సినీ పరిశ్రమలో అశ్లీలత ఎక్కువైందని, యువతను తప్పుదోవ పట్టించే చిత్రాలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వకూడదని ముకేశ్ అన్నారు