Nani : డిజాస్టర్ స్టోరీ లైన్ లో నాని సరిపోదా శనివారం

Update: 2024-08-08 05:20 GMT

నేచురల్ స్టార్ నాని, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా ఎస్.జే. సూర్య నెగెటివ్ రోల్ లో నటిస్తోన్న సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకుడు. డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ నెల 29న విడుదల కాబోతోందీ మూవీ. ఇప్పటి వరకూ టీజర్స్ లాంటివి మాత్రమే విడుదల చేసినా ఆడియన్స్ అటెన్షన్ ను సంపాదించుకుందీ మూవీ. అలాగే ఆ మధ్య విడుదలైన పాట కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆగస్ట్ 15 సినిమాల హడావిడీ ఉంది. అందుకే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. బట్ సూర్య బిజీ షెడ్యూల్స్ కారణంగా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. సూర్యతో ఇంటర్వ్యూస్ ఇప్పిస్తున్నారు. సూర్యకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి అది వర్కవుట్ అవుతుందనే చెప్పాలి. అయితే ఈ మూవీ థీమ్ కు సంబంధించి సూర్య చెప్పిన విషయాలు వింటే ఒకప్పటి చిరంజీవి డిజాస్టర్ మూవీ బిగ్ బాస్ గుర్తొస్తుంది.

సరిపోదా శనివారంలో హీరోకు విపరీతమైన కోపం ఉంటుందట. ఆ కోపం వల్ల అనేక సమస్యలు వస్తుంటే చిన్నప్పుడే తల్లి అతని వద్ద మాట తీసుకుంటుందట. కోపాన్ని అన్ని రోజులు కాకుండా వారానికి ఒక రోజు మాత్రమే చూపాలనేదే ఆ మాట. అందుకే ఆ ఒక్క రోజు తన కోపాన్ని ప్రదర్శిస్తుంటాడట హీరో. అయితే ఈ లైన్ వింటేనే నీరసం వస్తోంది కదా. మరి సోమవారమో, శుక్రవారమో ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ వస్తే.. హీరోయిన్ నో, హీరో తల్లినో ఎవరైనా ఇబ్బంది పెడితే అవేం పట్టించుకోకుండా.. శనివారం చూసుకుందాం లే అని హీరో కామ్ గా ఉంటే డ్రామా పండదు కదా. పైగా మాస్ ను మెప్పించాలనే ప్రయత్నం కనిపిస్తోంది. అలాంటి టైమ్ లో ఈ తరహా కంటెంట్స్ ఎక్కువ మైనస్ అవుతాయే తప్ప ప్లస్ కాదు.

బిగ్ బాస్ లో కూడా హీరో కోపంతో ఉంటాడు. అన్యాయం జరిగితే సహించడు. దీని వల్ల తన కొడుకుకి ఏమైనా అవుతుందేమో అని హీరో తల్లి అతనితో 'అయ్యప్ప మాల" వేయిస్తుంది. ఇష్టం లేకపోయినా తల్లికోసం మాల వేసుకుని దీక్షకు దిగుతాడు. అప్పుడే రౌడీలు రెచ్చిపోతారు. మనోడు సైలెంట్ గా ఉంటాడు. థియేటర్ లో గోలగోల. ఇమేజ్ ఏదైనా హీరో హీరోనే కదా. అలాంటి హీరో అన్యాయం జరుగుతుంటే అన్నీ మూసుకుని ఉంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. బిగ్ బాస్ లో చివరికి కన్నతల్లే వచ్చి మాల తీసేసి ఫైట్ చేయమంటుంది. బట్ అప్పటికే నష్టం జరిగిపోయింది. సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

సరిపోదా శనివారంలో హీరో కోపం శనివారమే చూపుతాడు. అంటే మిగతా వారం ఏం జరిగినా ఓకే అనే కదా అర్థం. మరి ఈ శనివారం టైటిల్ కు తగ్గట్టుగానే కథ, కథనాలు ఉంటే ఓకే. బట్ అలా కాకుండా ఉంటే మాత్రం నాని కూడా బిగ్ బాస్ రిజల్ట్ నే చూస్తాడు.

Tags:    

Similar News