Ante Sundaraniki Teaser : 'అంటే సుందరానికి' టీజర్ వచ్చేసింది..!
Ante Sundaraniki Teaser : నేచురల్ స్టార్ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వం డైరెక్షన్‌లో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'అంటే సుందరానికీ'..;
Ante Sundaraniki Teaser : నేచురల్ స్టార్ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వం డైరెక్షన్‌లో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'అంటే సుందరానికీ'.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో నాని సరసన మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ నటిస్తోంది.
ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి బుధవారం టీజర్ రిలీజైంది. ఇందులో నాని సుందర్ అనే బ్రాహ్మణుడిగా నటిస్తుండగా, నజ్రియా ఫహద్ లీలా అనే క్రిస్టియన్‌గా కనిపించనుంది.
వీరిద్దరి మధ్య పరిచయం, ప్రేమ ఎలా మొదలైంది, మత ఆచారాలకు కట్టుబడి ఉండే ఇరు కుటుంబాలను ఒప్పించడానికి హీరోహీరోయిన్లు ఎన్ని తిప్పలు పడ్డారు? అన్న కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. జూన్ 10 న ఈ సినిమా రిలీజ్ కానుంది.