Ananya Panday: ఆర్యన్ ఖాన్ వాట్సప్ చాట్‌లో అనన్య పాండే పేరు.. నిజమేనా?
Ananya Panday: బాలీవుడ్‌లో డ్రగ్స్ కాంట్రవర్సీ ఎప్పటికీ తేలేది కాదు.;
Ananya Panday (tv5news.in)
Ananya Panday: బాలీవుడ్‌లో డ్రగ్స్ కాంట్రవర్సీ ఎప్పటికీ తేలేది కాదు. రెండేళ్ల క్రితం మొదలయిన ఈ గొడవ ఇప్పటికీ అలాగే ఉంది. అప్పటినుండి ఎన్‌సీబీఐ చూపు మొత్తం బాలీవుడ్ సెలబ్రిటీల పైనే ఉంది. తాజాగా ఒక రేవ్ పార్టీకి వెళ్లడం, అక్కడ డ్రగ్స్ వాడకం జరగడం.. ఇదంతా ఎన్‌సీబీఐకి మరోసారి బాలీవుడ్‌లో దీనిపై చిచ్చు రేగేలా చేసింది. ఆ రేవ్ పార్టీలో షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత తాజాగా ఒక బాలీవుడ్ బ్యూటీ ఇంటిలో ఎన్‌సీబీఐ సోదాలు నిర్వహించింది.
ఈరోజు (గురువారం) ఉదయం బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఇంటిలో ఎన్‌సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ ఆమె ఫోన్‌ను స్వాదీనం చేసుకున్న అధికారులు మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని తెలిపారు. రేవ్ పార్టీ జరుగుతన్న సమయంలో ఆర్యన్ ఖాన్.. డ్రగ్స్ కోసం ఒక నటికి వాట్సప్ మెసేజ్ పంపినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే ఆ సమయంలో ఆర్యన్ చాట్ చేసింది అనన్య పాండేతోనే అని తేలింది. అలా అనన్య కూడా ఈ డ్రగ్స్ కేసులో చిక్కుకుంది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న అనన్య.. వరుసగా యంగ్ హీరోలతో నటిస్తూ తన యాక్టింగ్‌కు పదును పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ తనపై వస్తున్న ఈ ఆరోపణలు నిజమయితే.. కొంతకాలం తన కెరీర్‌కు బ్రేక్ పడినట్టే అనుకుంటున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు.
అనన్య పాండే ఇంటితో పాటు షారూఖ్ ఖాన్ ఇంట్లో కూడా ఎన్‌సీబీఐ తనిఖీలు నిర్వహించారు. ఉదయం తన కొడుకు ఆర్యన్‌ను కలవడానికి జైలుకు వెళ్లాడు షారూఖ్. తాను ఇంటికి వచ్చిన కాసేపటికే ఎన్‌సీబీఐ అధికారులు షారూఖ్ ఇల్లు మన్నత్‌కు చేరుకుని సోదాలు ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఆర్యన్ ఖాన్ బెయిల్ గురించి ముంబాయి హైకోర్టు అక్టోబరు 26న విచారణ చేపట్టనుంది.