Nikhil Siddhartha : నిఖిల్ పాన్ ఇండియా మూవీ..దర్శకుడు ఎవరంటే...!
Nikhil Siddhartha : గూడఛారి, ఎవరు, హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గ్యారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ ఓ సినిమా చేయబోతున్నాడు..;
Nikhil Siddhartha : యంగ్ హీరో నిఖిల్ నుంచి కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. గూడఛారి, ఎవరు, హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గ్యారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ ఓ సినిమా చేయబోతున్నాడు.. నిఖిల్ 19వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి స్పై అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నిఖిల్.. గన్ చేతపట్టుకుని బుల్లెట్ల మధ్యలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఈ ఏడాది దసరాకి మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
Here is the first look poster of our film #SPY 😍
— ISWARYA MENON (@Ishmenon) April 17, 2022
SPY ATTACKING PAN INDIAN THEATRES (5 languages)
this DASARA 2022 💫
స్పై - स्पाई - ஸ்பை - ಸ್ಪೈ - സ്പൈ @actor_nikhil @garrybh1988 @tej_uppalapati @julian_amaru @a.gomatam #EDEntertainments #krajashekarreddy pic.twitter.com/ELfGlkWs7J