Varun Tej : మట్కాను ఎవరూ పట్టించుకోవడం లేదే..

Update: 2024-11-13 08:42 GMT

ఒకట్రెండు ఫ్లాపులు వస్తే ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడుతుంది. హ్యాట్రిక్ ఫ్లాపులు ఉన్న హీరో వరుణ్ తేజ్. అతనికి ఫస్ట్ ఫ్లాప్ తర్వాత వెంటనే ఓపెనింగ్స్ తగ్గాయి. ఎంతలా అంటే చెప్పుకోవడానికి మెగా ఫ్యామిలీ హీరో అన్న ట్యాగ్ మాత్రమే ఉంది కానీ.. అతని చివరి సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’కు ఫస్ట్ డే కలెక్షన్స్ కేవలం లక్షల్లోనే ఉన్నాయి. 50 -60 లక్షల మధ్య ఉన్నాయి కలెక్షన్స్. అంటే టైర్ 3 హీరోల స్థాయికి దిగిపోయాడు అనే చెప్పాలి. అంతకు ముందు వచ్చిన గని, గాండీవధారి అర్జునకి సైతం ఇదే పరిస్థితి. అది ఖచ్చితంగా మట్కాపై ప్రభావం చూపిస్తుంది కదా. అదే కనిపిస్తోందిప్పుడు.

ఓ రకంగా చెబితే మట్కా నుంచి ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా ఆకట్టుకుంది. బట్ సినిమాపై బజ్ లేదు. ఓపెనింగ్స్ పైనా ప్రభావం కనిపించబోతోందని అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్థం అవుతోంది. వరుణ్ తేజ్ మూవీపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పోయింది అనేందుకు ఇదో ఎగ్జాంపుల్ గానూ అనుకోవచ్చు. కెరీర్ ఆరంభంలో వైవిధ్యమైన కథలతో ఆకట్టుకున్న వరుణ్ తర్వాత ట్రాక్ తప్పాడు.

మరోవైపు దర్శకుడు కరుణ కుమార్ గురించి కామన్ ఆడియన్స్ లో కూడా పెద్దగా తెలియదు. పలాస చూసిన వాళ్లు ఎంతమంది అంటే కూడా చెప్పలేం. ఆ తర్వాత అతను చేసిన రెండు సినిమాలూ పోయాయి. ఇటు మీనాక్షి చౌదరి తో పాటు నోరా ఫతేహి, నవీన్ చంద్ర, సలోని, మైమ్ గోపి, అజయ్ ఘోష్ వంటి ప్యాడింగ్ ఉన్నా.. వీళ్లెవరికీ అదనంగా టికెట్స్ తెప్పించే సత్తా లేదు.

కాకపోతే తిరిగి ట్రాక్ లోకి తెచ్చేలానే కనిపిస్తోందీ మట్కా. బట్ మినిమం ఓపెనింగ్స్ కూడా వస్తాయన్న సూచనలేం కనిపించడం లేదు. ఓ రకంగా చూస్తే ప్రమోషన్స్ కూడా పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు అనే చెప్పాలి. అందుకే ప్రస్తుతానికైతే ఈ చిత్రాన్ని తెలుగులో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంక ఇతర భాషల్లో పట్టించుకుంటారా అంటే అది వేరే చెప్పాలా..?

Tags:    

Similar News