2010 ఎన్టీఆర్ ఒకే యేడాది రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. అదుర్స్, బృందావనం మూవీస్ అవి. ఈ రెండు సినిమాలూ వైవిధ్యమైనవి. ఒకటి క్లాస్ గా ఉంటే మరోటి హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్. 2011 శక్తి ఆల్ టైమ్ డిజాస్టర్. ఊసరవెల్లి యావరేజ్ మూవీ. ఇక అప్పటి నుంచి వరుసగా దమ్ము డిజాస్టర్.. బాద్ షా జస్ట్ హిట్. ఆపై రామయ్యా వస్తావయ్యా, రభస ఫ్లాప్. మరోవైపు ఇతర హీరోలు 50 కోట్ల క్లబ్ అంటూ కొత్త ట్రెండ్ మొదలైతే.. ఎన్టీఆర్ హిట్ టాక్ తెచ్చుకోవడానికే తంటాలు పడుతున్న టైమ్ అది. పైగా అన్నీ రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలుగానే విమర్శలు వస్తున్న సమయం. అప్పుడు ఓ ప్రయోగం లాంటిదే చేశాడు. పూరీ జగన్నాథ్ దర్శకుడు. కథ వక్కంతం వంశీది. ఎన్టీఆర్ పోలీస్ పాత్ర. కానీ పోలీస్ అనగానే ఆడియన్స్ కు గుర్తొచ్చే ఒక్క అంశమూ కనిపించదీ మూవీ. ఎన్టీఆర్ కరెప్టెడ్ పోలీస్ గా కనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ అంతా అతనే విలన్ మాదిరి కనిపిస్తాడు. అసలు విలన్ అయిన ప్రకాష్ రాజ్ కు తొత్తుగా ఉంటాడు. ఇలాంటి క్యారెక్టరైజేషన్ తో ఎన్టీఆర్ లాంటి స్టార్ మూవీ అంటే యాక్సెప్ట్ చేస్తారా. కానీ వరుసగా వస్తోన్న ఫ్లాపులు, డిజాస్టర్లు అతన్ని ఈ చిత్రం ఒప్పుకునేలా చేశాయి. ముఖ్యంగా క్లైమాక్స్.
అలా వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ తర్వాత ఆడియన్స్ లో నెగెటివ్ ఇంపాక్ట్ నే క్రియేట్ చేసింది. కానీ సెకండ్ హాఫ్ లో ఒక్కో థ్రెడ్ ను కలుపుతూ .. హీరో పశ్చాత్తాపం చెందడమే కాదు.. ఏకంగా న్యాయం కోసం చనిపోవడానికే సిద్ధం కావడం అనే పాయింట్ ఆడియన్స్ మైండ్స్ ను బ్లాంక్ చేసింది. ఫస్ట్ హాఫ్ తర్వాత ఫ్లాప్ టాక్ ఉంటే.. సెకండ్ హాఫ్ తర్వాత బ్లాక్ బస్టర్ టాక్ తో బయటకు వచ్చారు ప్రేక్షకులు.
ఇక ఈ మూవీ తర్వాత ఇప్పటి వరకూ ఎన్టీఆర్ ఒక్క ఫ్లాప్ కూడా చూడలేదు. అంతే కాదు టెంపర్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఆ వెంటనే చేసిన నాన్నకు ప్రేమతో మూవీతో తన గెటప్ మార్చాడు. కొత్త లుక్ తో కనిపించే ధైర్యం చేశాడు. ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడమే కాదు.. ఫస్ట్ 100 క్రోర్ క్లబ్ లోకి ఎంటర్ అయ్యేలా చేశారు. ఇక వరుసగా జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ వరుసగా బ్లాక్ బస్టర్స్. ఆర్ఆర్ఆర్ తో ప్యాన్ ఇండియా ఇమేజ్.. దేవరతో దాన్ని నిలబెట్టుకున్న కరేజ్. ఇదీ టెంపర్ ఎన్టీఆర్ కెరీర్ కు ఇచ్చిన బూస్టప్. ఒకవేళ టెంపర్ పోయి ఉంటే ఖచ్చితంగా కొత్త ప్రయత్నాలు చేసి ఉండేవాడు కాదేమో. అందుకే అతని కెరీర్ లో అంతకు ముందు ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నా.. విభజన చేస్తే మాత్రం టెంపర్ కు ముందు.. టెంపర్ కు తర్వాత అనే చెప్పాల్సి ఉంటుంది.
ఇప్పుడిదంతా ఎందుకూ అంటారా.. ఈ మూవీ విడుదలై నేటికి 10యేళ్లు. 2015 ఫిబ్రవరి 13న అన్ సీజన్ లో విడుదలై అల్టిమేట్ హిట్ అనిపించుకుంది. ఈ పదేళ్లలో ఎన్టీఆర్ ఏం సాధించాడో చెప్పడానికే టెంపర్ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ అంటున్నారు ఫ్యాన్స్. అదన్నమాట.