NTR : లుక్స్ తో అదరగొడుతున్న ఎన్టీఆర్

Update: 2025-08-05 10:26 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ టైమ్ లో ప్రమోషన్స్ తో బిజీగా ఉండాలి. కానీ మనోడు ఆల్ట్రా స్టైలిష్ ఫోటో షూట్స్ తో అదరగొడుతున్నాడు. అయితే ఇవన్నీ వార్ 2 ప్రమోషన్స్ లో భాగమే అని కొందరు చెబుతున్నారు. అయినా ఈ టైప్ లుక్స్ లో ఎన్టీఆర్ ఎప్పుడూ కనిపించలేదు. మాగ్జిమం సీరియస్ లుక్స్ తోనే ఎక్కువగా కనిపిస్తాడు టైగర్. ఇవన్నీ చూసి ఫ్యాన్స్ కూడా పిచ్చెత్తిపోతున్నారు. అసలు ఈ లుక్స్ ఏంటన్నా అంటూ సోషల్ మీడయా మొత్తం హోరెత్తిస్తున్నారు. ఇవాళ ఉదయం ఫస్ట్ టైమ్ దుబాయ్ బేస్డ్ గా నడిచే ఇస్క్వైర్ మాగజిన్ కవర్ పేజ్ పై అతని ఫోటో చూసి చాలామంది వావ్ అనుకున్నారు.

కట్ చేస్తే వరుసగా అదే మాగజిన్ కోసం మరికొన్ని స్టిల్స్ వచ్చాయి. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇంత స్టైలిష్ స్టిల్స్ లేవు అంటే అతిశయోక్తి కాదు. ఆ రేంజ్ లో ఉన్నాయి. లాంగ్ వ్యూలో ఓ కుర్చీపై వాలి కూర్చున్న స్టిల్ తో పాటు క్లోజప్ లో బ్లాక్ అండ్ వైట్ లో మరో రెండు మూడు స్టిల్స్. ఇలా చూస్తే సడెన్ గా ఎన్టీఆర్ పిఆర్ టీమ్ ఇంత ఫాస్ట్ అయిందేంటా అనిపించక మానదు. అయితే ముందే చెప్పినట్టు ఇవి వార్ 2 టీమ్ నుంచి చేస్తోన్న పిఆర్ వర్క్ గా కనిపిస్తోందంటున్నారు కొందరు. ఏదేమైనా ఎన్టీఆర్ ను ఈ కొత్త అవతార్ లో చూసే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోతున్నారు.

 

Tags:    

Similar News