NTR - Prashanth Neel : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్.. ఒక 500 కోట్లు

Update: 2025-04-26 09:17 GMT

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘డ్రాగన్’ మూవీ 500 కోట్లు కలెక్ట్ చేస్తుందట. ఇందులో ఆశ్చర్యం ఏముందీ.. ఇంత పెద్ద స్టార్స్ కలిసి చేసే సినిమాకు 500 కోట్లు అంటే చాలా చిన్న అమౌంట్ కదా అనుకుంటున్నారేమో. బట్ ఈ 500 కోట్లు కేవలం హిందీలోనే వసూలు చేస్తుందంటున్నారు. ఇప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. యస్.. ఇందుకోసం వీరి లెక్కలు వీరికి ఉన్నాయి. వీళ్లు అనుకుంటోన్న ఆ మొత్తం వసూలు ఎలా అవుతుందీ అంటే దేవర తో పాటు వార్ 2ను చూపిస్తున్నారు.

దేవర మూవీ సోలోగానే హిందీలో 65 కోట్లకు పైగా వసూలు చేసింది. అక్కడ డైరెక్ట్ మూవీస్ కంటే చాలా బెటర్ అమౌంట్ అది. అంటే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఛరిష్మాకు వచ్చిన కలెక్షన్స్ అవి. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా హిందీలోనే వార్ 2 చేస్తున్నాడు. హృతిక్ రోషన్ ఉన్నా.. ఇద్దరి పాత్రలకూ సమాన ప్రాధాన్యం ఉంటుంది. పైగా ఎన్టీఆర్ కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అనే టాక్ ఉంది. అలాంటి పాత్ర పడితే మనోడు నటనతో చెలరేగిపోతాడు కదా. అందుకే ఈ మూవీ భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే ఎన్టీఆర్ రేంజ్ దేవర తర్వాత వార్ 2 తో మరింత పెరుగుతుంది.

ఇటు ప్రశాంత్ నీల్ కు ఆల్రెడీ నార్త్ బెల్ట్ లో మంచి మార్కెట్ వచ్చింది. అలా దేవర, వార్ 2 ద్వారా పెరిగే ఎన్టీఆర్ మార్కెట్, ప్రశాంత్ నీల్ మార్కెట్ వాల్యూతో పాటు తమ సినిమా కంటెంట్ తో యాడ్ చేస్తే డ్రాగన్ మూవీ కేవలం హిందీలోనే 500 కోట్లు వసూలు చేస్తుందని లెక్కలు కడుతూ అంచనాలు వేస్తున్నారు. ఇంత వరకు బానే ఉంది.. ఒకవేళ ఫర్ సపోజ్.. వార్ 2 పోతే పరిస్థితి ఏంటీ..? వార్ 2లో ఎన్టీఆర్ పాత్ర తేలిపోతే అప్పుడూ ఈ లెక్కలు వర్తిస్తాయా..? అనే డౌట్స్ వస్తే తప్పేం లేదు. అంచేత.. డ్రాగన్ కంటెంట్ ను కలెక్షన్స్ వస్తాయని అంచనాలు వేసుకుంటే మంచిదేమో.

Tags:    

Similar News