OG Collections : ఒరిజినల్ కలెక్షన్స్ తో ఓ.జి పోస్టర్

Update: 2025-09-26 09:56 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ.జి సాలిడ్ ఓపెనింగ్స్ తో మొదలుపెట్టింది. బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ ప్రీమియర్స్ తో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఓ.జి 154 కోట్లు కొల్లగొట్టింది. చాలా మంది 100 కోట్లు కొట్టేస్తుంది అని భావించారు. కానీ అంతకు మించి మరో హాఫ్ సెంచరీ కూడా నమోదు చేసి రికార్డులు క్రియేట్ చేస్తోంది ఓ.జి. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మాసివ్ గ్యాంగ్ స్టర్ డ్రామాకు యూనానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చింది. పవన్ మూవీకి పాజిటివ్ టాక్ అంటే అది సూపర్ హిట్ అని ఫిక్స్ అయిపోయినట్టే అని చెప్పాలి. అందుకు నిదర్శనమే ఈ 154 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్.

పవన్ కు జోడీగా ప్రియాంక మోహన్ నటించింది. తన పాత్ర చిన్నదే అయినా మంచి ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ సినిమాకు మరో ఎసెట్ గా నిలిచారు. అన్నిటికీ మించి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ హైలెట్ అయింది. అన్నీ కలిపే ఓ.జి ఓ రేంజ్ లో నిలబెట్టాయి. సో.. ఈ హాలిడేస్ లో ఓ.జి ఈజీగా 300 కోట్లకు పైగా వసూలు చేసి హయ్యొస్ట్ తెలుగు గ్రాసర్ గా నిలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. 

 

Tags:    

Similar News