Pawan Kalyna vs Raviteja : మాస్ రాజాకు ఎసరు పెట్టిన వీరమల్లు

Update: 2025-03-11 09:15 GMT

హరిమర వీరమల్లు అఫీషియల్ గానే పోస్ట్ పోన్ అయింది. అయితే కొత్త డేట్ విషయంలోనూ ఓ క్లారిటీతో ఉంది. అందులో సమస్య లేదు. కానీ కొత్త డేట్ వల్ల మాస్ మహారాజ్ రవితేజకు సమస్య అవుతుంది. ఎందుకంటే వీరమల్లు కొత్త డేట్ .. ఆల్రెడీ రవితేజ మాస్ జాతర మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ అయిన డేట్. దీంతో పవర్ స్టార్ వర్సెస్ మాస్ మహారాజ్ గా మారబోతోందా వార్ అంటున్నారు.

రవితేజ హీరోగా భాను భోగవరపు డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా మాస్ జాతర. ధమాకా తర్వాత శ్రీ లీల మరోసారి రవితేజతో రొమాన్స్ చేయబోతోంది. సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న ఈ మూవీని రవితేజకు షూటింగ్ లో అయిన గాయం వల్ల సమ్మర్ కు మార్చారు. మే 9న విడుదల చేస్తున్నాం అని కొత్త డేట్ చెప్పారు. ఇప్పుడు ఆ డేట్ లోనే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లును విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మాస్ జాతర తప్ప మరో సినిమా ఇప్పటి వరకు ఆ డేట్ లో అనౌన్స్ కాలేదు. అందుకే రెండు సినిమాల మధ్య పోటీ ఉంటుంది. వీరికి ఏ తమిళ్ డబ్బింగ్ మూవీ అయినా పోటీగా వచ్చే అవకాశం ఉంది.

హరిహర వీరమల్లును ఈ నెల 28న విడుదల చేయాలనుకున్నా కుదర్లేదు. అందుకే వీళ్లు మే 9కి షిఫ్ట్ అవుతున్నారు. నిజానికి ఈ 28 కంటే మే నెల కరెక్ట్ గా ఉంటుందని చెప్పాలి. అప్పటికి అన్ని ఎగ్జామ్స్ అయిపోతాయి. సో.. స్టూడెంట్స్ తో పాటు హాలిడేస్ ను ఎంజాయ్ చేసేవారు ఈ రెండు సినిమాలూ చూసే అవకాశం ఉంది.

ఏదేమైనా పవన్ కళ్యాణ్ తో పోటీ అంటే రవితేజకు కాస్త సమస్య అనే చెప్పాలి. 

Tags:    

Similar News