Poonam Pandey: 'భర్త తాగొచ్చి కొట్టేవాడు'.. బాలీవుడ్ నటి కామెంట్స్.. ఫైర్ అయిన భర్త..
Poonam Pandey: ఇన్నాళ్లు పూనమ్ ఏమన్నా తాను ఓపికతో ఉన్నానని చెప్పుకొచ్చాడు సామ్.;
Poonam Pandey: కంగనా రనౌత్ లాక్ అప్ షోలో పార్టిసిపెంట్స్‌గా వచ్చిన అందరు సెలబ్రిటీలు ఒకప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకున్నవారే. అందులో ఒకరే పూనమ్ పాండే. ఒకప్పుడు కేవలం బోల్డ్ సినిమాలలో మాత్రమే నటించి.. కుర్రకారుకు క్రష్‌గా మారిపోయిన పూనమ్ పాండే.. గతకొంతకాలంగా లైమ్ లైట్‌లోకి రావడం లేదు. అలాంటి పూనమ్‌ను ఇప్పుడు లాక్ అప్ షోకు ఎంచుకుంది యాజమాన్యం.
పూనమ్ పాండే బాలీవుడ్ హీరో సామ్ బాంబేను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వారు విడివిడిగా ఉంటున్నారు. అయితే తన భర్త గురించి ఇటీవల లాక్ అప్ షోలో షాకింగ్ విషయాలను పంచుకుంది పూనమ్. తన భర్త సామ్ పొద్దున నుండి రాత్రి వరకు తాగుతూనే ఉండేవాడని, తనను ఎప్పుడూ అనుమానిస్తూ ఉండేవాడని చెప్పుకొచ్చింది పూనమ్.
ఒక్కొక్కసారి సామ్ ప్రవర్తన చూసి వారి స్టాఫ్ కూడా భయపడి పారిపోయేవారట. అటువంటి సమయంలో తనను కాపాడడానికి ఎవరూ ఉండకపోయేవారని తన బాధను బయటపెట్టింది పూనమ్. అంతే కాకుండా చాలాసార్లు తన భర్త తనను తలపై బలంగా కొట్టాడని చెప్పింది పూనమ్. పదే పదే ఒకేచోట కొట్టడం వల్ల తన తలకు తగిలిన గాయాలు ఇంకా మానిపోలేదని తెలిపింది. అయితే పూనమ్ వ్యాఖ్యలకు సామ్ స్పందించాడు.
ఇన్నాళ్లు పూనమ్ ఏమన్నా తాను ఓపికతో ఉన్నానని చెప్పుకొచ్చాడు సామ్. తన గురించి పూనమ్ ఏం చెప్తుందో అదంతా అబద్ధం అన్నాడు. ఆమె చెప్పేదంతా పనికిరాని చెత్త అని పేర్కొన్నాడు. పెళ్లి తర్వాత భార్యభర్తలు శృంగారం చేసుకుంటారని.. అలా చేస్తేనే తనపై అత్యాచారం చేస్తు్న్నాడంటూ కేసు పెట్టిందని సామ్ స్పష్టం చేశాడు.