Raadhika Sarathkumar: చిరంజీవి సినిమాల్లో అలాంటి పాత్ర మాత్రం చేయను: రాధిక

Raadhika Sarathkumar: చిరంజీవి తన సొంత కష్టంతో పైకి వచ్చారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాధిక.;

Update: 2022-04-04 14:54 GMT

Raadhika Sarathkumar: ఒకప్పుడు స్టార్ హీరోల సరసన హీరోయిన్లుగా నటించి స్టార్‌డమ్ చూసిన వారంతా ప్రస్తుతం నటీనటులకు తల్లి పాత్రల్లో, అక్క, వదిన పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు రాధిక శరత్ కుమార్. ప్రస్తుతం రాధిక తెలుగు, తమిళ సినిమాల్లో హీరోలకు, హీరోయిన్లకు తల్లి పాత్రలు చేస్తూ కెరీర్‌ను మంచి ఫార్మ్‌లో కొనసాగిస్తోంది. అయితే తాజాగా రాధిక.. చిరంజీవిపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి, రాధిక కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఈ పెయిర్‌కు ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ప్రస్తుతం చిరంజీవి ఇంకా హీరోగా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నాడు. రాధిక కూడా ఇంకా తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉంది. అయితే తాజాగా చిరంజీవితో మళ్లీ నటించే అవకాశం వస్తే చేస్తారా లేదా అన్న ప్రశ్నకు రాధిక ఆసక్తికరమైన జవాబు ఇచ్చింది.

చిరంజీవి తన సొంత కష్టంతో పైకి వచ్చారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాధిక. ఇప్పటికీ ఆయన అంతే డేడికేషన్‌తో పని చేస్తున్నారన్నారు. మెగాస్టార్‌ అయినప్పటికీ చాలా ఒదిగి ఉంటారని తెలిపారు. అంతే కాకుండా అందరితో బాగా కలిసిపోతారని బయటపెట్టారు. చిన్నపిల్లాడిలా అల్లరి చేస్తుంటారని కూడా అన్నారు రాధిక. అయితే చిరంజీవి సినిమాల్లో విలన్‌గా చేయడానికి అయినా తాను సిద్ధం అని.. కానీ తల్లి మాత్రం చేయనని రాధిక తేల్చిచెప్పారు.

Tags:    

Similar News