Raashi Khanna: 'ప్లీజ్ ఇదంతా ఆపేయండి'.. రాశి ఖన్నా రిక్వెస్ట్..
Raashi Khanna: నేను సౌత్ ఇండస్ట్రీ గురించి చెడుగా మాట్లాడినట్టు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగుతోంది;
Raashi Khanna: బొద్దుగుమ్మ రాశి ఖన్నాకు తెలుగులో చాలానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటిగా బాలీవుడ్‌లో పరిచయమయినా కూడా ఒక హీరోయిన్‌గా రాశి స్టార్‌డమ్ సంపాదించుకుంది మాత్రం తెలుగులోనే. అయితే ఇటీవల రాశి ఖన్నా సౌత్ ఇండస్ట్రీ గురించి కామెంట్స్ చేసిందంటూ సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై రాశి ఖన్నా తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది.
బాలీవుడ్‌లో 'మద్రాస్ కేఫ్' అనే సినిమాలో నటించిన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అజయ్ దేవగన్ హీరోగా నటించిన 'రుద్ర' అనే వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులను పలకరించింది రాశి ఖన్నా. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ సమయంలో రాశి.. సౌత్ ఇండస్ట్రీపై నెగిటివ్ కామెంట్స్ చేసిందని ప్రచారం సాగింది. దీనికి రాశి ఇటీవల రెస్పాండ్ అయ్యింది.
'నేను సౌత్ ఇండస్ట్రీ గురించి చెడుగా మాట్లాడినట్టు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగుతోంది. ఇది ఎవరైతే చేస్తున్నారో ప్లీజ్ ఆపేయండి. నేను పనిచేసే ప్రతీ భాష పట్ల, ప్రతీ సినిమా పట్ల నాకు చాలా గౌరవం ఉంటుంది. మంచిగా ఉందాం' అని తన ట్విటర్‌లో ట్వీట్ చేయడంతో పాటు.. తన ఇన్‌స్టా్గ్రామ్ స్టోరీలో కూడా షేర్ చేసింది రాశి ఖన్నా.
🙏🏻😊 pic.twitter.com/yQa1nOacEY
— Raashii Khanna (@RaashiiKhanna_) April 6, 2022