Rashmika Mandana: 'పుష్ప' కోసం చాలా కష్టపడ్డా..: రష్మిక
Rashmika Mandana: ప్పుడు సినిమాలో తన పాత్ర, తన భాష చూసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందని తెలిపింది రష్మిక.;
Rashmika Mandana: అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశం రావడంతో ఎగిరిగంతేసింది. సుకుమార్ తనని ఎంపిక చేయడం అదృష్టంగా భావించింది. కానీ అందులో మాట్లాడే భాష చిత్తూరు మాండలీకంలో ఉండాలని చెప్పారు. దాంతో రేయింబవళ్లు కష్టపడుతూ భాషపై పట్టు సాధించింది.
ముందు కష్టంగా అనిపించినా పట్టుదలతో నేర్చుకుని మాట్లాడడం మొదలు పెట్టిందట. ఇప్పుడు సినిమాలో తన పాత్ర, తన భాష చూసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందని తెలిపింది రష్మిక. కాగా, ఈ బ్యూటీకి బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం మిషన్ మజ్నూ, గుడ్ బై చిత్రాల్లో నటించేందుకు సైన్ చేసింది.