Rashmika Mandanna: బాలీవుడ్ హీరోతో అరబిక్ కుతు స్టెప్పేయించిన రష్మిక.. వీడియో వైరల్
Rashmika Mandanna: పుష్ప హిందీలో కూడా విపరీతంగా క్రేజ్ సంపాదించుకోవడంతో రష్మికకు మరిన్ని హిందీ ఆఫర్లు వస్తున్నాయని టాక్.;
Rashmika Mandanna (tv5news.in)
Rashmika Mandanna: రష్మిక మందనా.. కన్నడ నుండి వచ్చి సౌత్‌లో సెటిల్ అయ్యి.. ఇప్పుడు నార్త్‌ను ఏలేయడానికి సిద్ధమవుతోంది ఈ బ్యూటీ. కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది రష్మిక. ప్రస్తుతం ఈ భామ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పైగా ఇటీవల విడుదలయిన 'పుష్ప' తనకు పాన్ ఇండియా క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ఇటీవల ఈ భామ.. ఓ బాలీవుడ్ హీరోతో కలిసి స్టెప్పులేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
ఇప్పటికే రష్మిక చేతిలో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తున్న 'మిషన్ మజ్ను'తో పాటు అమితాబ్ బచ్చన్‌తో కలిసి చేస్తున్న 'థాంక్యూ' చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ఈ సినిమా అవకాశాలు వచ్చే సమయానికి రష్మిక.. సౌత్‌లోనే పాపులర్‌గా ఉంది. అయినా కూడా ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తన దగ్గరకు వచ్చాయి. అయితే పుష్ప సినిమా హిందీలో కూడా విపరీతంగా క్రేజ్ సంపాదించుకోవడంతో రష్మికకు మరిన్ని హిందీ సినిమా ఆఫర్లు వస్తున్నాయని టాక్.
రష్మిక.. ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి ఫోటో దిగింది. ఈ ఫోటో కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రష్మిక, వరుణ్ కలిసి సినిమా చేస్తున్నారంటూ కథనాలు మొదలయ్యాయి. అయితే ఈ కథనాలు నిజమే అని చాలావరకు కన్ఫర్మ్ అయిపోయింది. తాజాగా రష్మిక, వరుణ్ ధావన్ కలిసి అరబిక్ కుతు పాటకు స్టెప్పులేశారు. 'ఈ పాట, విజయ్ సార్ స్టైల్ చాలా నచ్చింది' అంటూ వీరి డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు వరుణ్.
Yo habibo
— VarunDhawan (@Varun_dvn) March 10, 2022
Love this track and style of Vijay sir pic.twitter.com/YcGBakgORm