NTR Devara 1 : నెల ముందే దేవర వేట మొదలు

Update: 2024-08-31 08:52 GMT

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర 1. జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ విలన్. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సెప్టెంబర్ 27న దేవర 1 విడుదల కాబోతోంది. అనిరుధ్ సంగీతం చేస్తోన్న ఈ మూవీ విడుదలకు ఇంకా నెల రోజులు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రికార్డులు క్రియేట్ చేయబోతోందా అన్నంత దూకుడు చూపిస్తోంది. అయితే ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియాలో కాదు. యూఎస్ లో.

యూఎస్ లో చాలా తక్కువ చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారట. బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే 70 వేల డాలర్లకు పైగా కలెక్షన్స్ కనిపిస్తున్నాయని టాక్. అంటే రిలీజ్ కు ముందు ఈ అరాచకం మామూలుగా ఉండదు అని చెప్పాలి. మరీ ప్రభాస్ ను కొట్టేస్తాడు అని చెప్పలేం కానీ.. ఆ తర్వాతి రికార్డ్ ను సాధించినా ఆశ్చర్యం లేదు అనే చెప్పాలి. మరి నెల రోజు ముందు అదీ విదేశాల్లోఈ రేంజ్ క్రేజ్ ఉందంటే ఇంక ఇక్కడ ఎలా ఉంటుందో అంచనాలు కూడా వేయలేం. ఏదేమైన దేవర సునామీ స్టార్ట్ అయిందనే చెప్పాలి. మరి ఈ సునామీకి ఎన్ని రికార్డులు కొట్టుకుపోతాయో చూడాలి.

Tags:    

Similar News