Venkatesh : సంక్రాంతికి వస్తున్నాం.. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్

Update: 2025-02-03 09:30 GMT

విక్టరీ వెంకటేష్.. మరోసారి సంక్రాంతి స్టార్ అని ప్రూవ్ చేసుకున్నాడు. కేవలం కథను నమ్మి ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న దర్శకుడికి వదిలేస్తే ఎలాంటి బ్లాక్ బస్టర్ కొట్టొచ్చో మరోసారి నిరూపణ అయింది. సంక్రాంతికి వస్తున్నాం.. ఎవరూ ఊహించని విధంగా ఈ పండగను ఆ మూవీ టీమ్ లైఫ్ లాంగ్ సెలబ్రేట్ చేసుకునేలా చేసింది. అసలు కనీవినీ ఎరుగని వసూళ్లతో సినిమా తీసిన వారికి కూడా షాకులు ఇస్తూ కలెక్షన్స్ సాధిస్తోందీ మూవీ. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది. యస్.. ఈ మూవీ 303 కోట్ల వసూళ్లతో ఓ రీజనల్ మూవీగా ఈ రికార్డ్ ను సాధించింది. ఇప్పటి వరకూ ఈ ప్లేస్ లో మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య ఉండేది. కానీ ఆ మూవీ 236.15 కోట్ల దగ్గరే ఆగిపోయింది. అంటే చిరంజీవి కంటే వెంకటేష్ దాదాపు 60 కోట్ల వరకూ ముందంజలో ఉన్నాడు. వెటరన్స్ కు మాత్రమే కాదు.. ఇప్పట్లో ఈ రికార్డును ‘ఇలాగే’(రీజనల్ మూవీగా) బ్రేక్ చేయడం ఇంకెవరికీ సాధ్యం కాదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

 

నిజానికి సంక్రాంతికి వస్తున్నాం మూవీ అల్టిమేట్ కంటెంట్ కాదు. కానీ సెలబ్రేషన్స్ టైమ్ లో వచ్చి.. ఆ సెలబ్రేషన్స్ ను డబుల్ చేసే వినోదం ఉంది. అదే సినిమాకు అఖండ విజయాన్ని అందించింది. మిగతా స్టార్స్ ఇంతకంటే ఎక్కువే వసూళ్లు సాధించారు. కానీ అవన్నీ ప్యాన్ ఇండియా సినిమాలు. సంక్రాంతికి వస్తున్నాం కేవలం తెలుగు భాషతోనే ఈ రేంజ్ వసూళ్లు సాధించింది. వెంకటేష్ టైమింగ్, హీరోయిన్ల డామినేటింగ్ పర్ఫార్మెన్స్, అనిల్ రావిపూడి రైటింగ్, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్.. అన్నీ హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవడంతోనే ఈ మూవీ ఇప్పుడు ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలవడానికి కారణమైంది.

Tags:    

Similar News