Shock for Devara in AP : దేవరకు ఏపీలో షాక్.. పదిరోజులే ఊరట!

Update: 2024-09-26 12:30 GMT

జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకు ఏపీలో చుక్కెదురైంది. 14 రోజుల పాటు సినిమా టికెట్లు పెంచుకునేలా ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధర పెంచడాన్ని 10 రోజులకే పరిమితం చేయాలని ప్రభుత్వానికి సూచనలు చేసింది. మల్టీఫ్లెక్స్ లో ఒక్కో టికెట్ పై 135 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ టికెట్ పై 110 రూపాయలు.. లోయర్ క్లాస్ టికెట్ పై 60 రూపాయల వరకు పెంచారు. ఐతే.. తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

Tags:    

Similar News