Shyam Singha Roy Box Office Collection: కలెక్షన్లలో జోరు చూపిస్తున్న 'శ్యామ్ సింగరాయ్'..
Shyam Singha Roy Box Office Collection: నేచురల్ స్టార్ నాని కెరీర్ ఇప్పటికీ ఎన్నో మైలురాళ్లను చేరుకున్నాడు.;
Shyam Singha Roy Box Office Collection: నేచురల్ స్టార్ నాని కెరీర్ ఇప్పటికీ ఎన్నో మైలురాళ్లను చేరుకున్నాడు. కానీ మొదటిసారి ఆయన కెరీర్‌లో చేసిన ఓ వినూత్న ప్రయత్నమే 'శ్యామ్ సింగరాయ్'. పునర్జన్మల కథాంశం, పీరియాడిక్ లవ్ స్టోరీ, అన్నింటికంటే ముఖ్యంగా పాన్ ఇండియా సినిమా.. ఇవన్నీ నాని తన కెరీర్‌లో మొదటిసారి చేస్తున్న ప్రయోగాలు. ఆ ప్రయోగం చాలావరకు సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తోంది.
'శ్యామ్ సింగరాయ్' సినిమా విడులదయిన మొదటిరోజు నుండి మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ప్రమోషన్స్‌కంటే ఎక్కువగా శ్యామ్ సింగరాయ్‌కు మౌత్ టాకే ప్లస్ అయ్యింది. సాయి పల్లవి పర్ఫార్మెన్స్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. నాని మొదటిసారి ఓ కొత్త రకమైన పాత్ర చేసినా.. అందులో కూడా నేచురల్ అనిపించుకున్నాడు.
ఏరియాల వారీగా నాలుగు రోజుల 'శ్యామ్ సింగ రాయ్' కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజాం : రూ. 6.90 కోట్లు
సీడెడ్ : రూ. 1.82 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 1.55 కోట్లు
ఈస్ట్ : రూ. 0.68 కోట్లు
వెస్ట్ : రూ. 0.57 కోట్లు
గుంటూరు : రూ. 0.86 కోట్లు
కృష్ణా : రూ. 0.64 కోట్లు
నెల్లూరు : రూ. 0.43 కోట్లు
ఏపీ, తెలంగాణ : 13.45 కోట్లు (22.90 కోట్లు గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా : రూ. 2.40 కోట్లుఓవర్సీస్ : రూ. 3.20 కోట్లు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : రూ. 19.04 కోట్లు (రూ.34 కోట్లు గ్రాస్)..
ఏపీ, తెలంగాణ కలెక్షన్స్..
ఫస్ట్ డే : రూ. 4.17 కోట్లు
సెకండ్ డే : రూ.4.38 కోట్లు
థర్డ్ డే : రూ.3.52 కోట్లు
ఫోర్త్ డే : రూ.1.38 కోట్లు