యంగ్ బ్యూటీ శ్రీ లీల దూకుడుగా వచ్చి తర్వాత డల్ అయింది. ఇప్పుడు మళ్లీ టాప్ గేర్ లో దూసుకుపోతోంది. తెలుగుతో పాటు తమిళ్, బాలీవుడ్ లోనూ అడుగులు వేస్తోంది. తన కెరీర్ లో ఇప్పటి వరకూ ప్రయోగాలు చేయలేదు. జస్ట్ రెగ్యులర్ హీరోయిన్ గా కనిపిస్తోందంతే. తన ఫేస్ లో ఇంకా చైల్డిష్ లుక్ పోలేదు. అందుకే తను ప్రయోగాలు చేసినా వర్కవుట్ అవుతుందనుకోలేం. ఆ మధ్య భగవంత్ కేసరి చేసింది. అదీ తన లుక్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిన పాత్ర. అలాంటి తను అజయ్ భూపతి ‘మంగళవారం 2’లో నటించబోతోందనే పుకార్లు వస్తున్నాయి. నిజానికి ఇవి అస్సలు ఏ మాత్రం నమ్మాల్సిన అవసరం లేని రూమర్స్ అనుకోవచ్చు.
అసలు ఇప్పటి వరకూ మంగళవారం2 రాబోతోందని అజయ్ భూపతి నుంచి ఖచ్చితమైన సమాచారమే రాలేదు. పైగా ఆ మూవీకి సెకండ్ పార్ట్ అంటే పాత పాత్రలనూ కొనసాగించాలి. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లోని ప్రధాన పాత్రలు అంతం కాలేదు. అలాంటప్పుడు పాయల్ రాజ్ పుత్, ప్రియదర్శి, లక్ష్మణ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు అలాగే ఉంటారు. పాయల్ ప్రధాన పాత్ర చేయకపోయినా శ్రీ లీల ఈ తరహా పాత్ర చేస్తుంది అనుకోలేం.
సో.. మంగళవారం 2లో శ్రీలీల అనే వార్త పూర్తిగా అసంబద్ధం అయినదీ.. ఆధారం లేనిదీ అనుకోవచ్చు. అసలే ఇప్పుడు తను చేస్తోన్న సినిమాలతో రేంజ్ కూడా మార్చుకుంటుంది. అంటే అజయ్ రేంజ్ చిన్నదని కాదు. అతనింకా తనది పెద్ద రేంజ్ అని ప్రూవ్ చేసుకోలేదు అని మాత్రమే. ఒకవేళ అద్భుతమైన స్క్రిప్ట్ తో వెళ్లి ఇదే చిత్రానికి శ్రీ లీలను ఒప్పించినా ఆశ్చర్యం లేదు కానీ.. ఇప్పటికైతే ఇది పూర్తిగా బేస్ లెస్ గాసిప్.