Sreeleela శ్రీ లీల సెట్ అయింది.. ఇక కృతిశెట్టి మిగిలింది..?

Update: 2024-12-19 10:45 GMT

కృతిశెట్టి, శ్రీ లీల.. ఇద్దరు యంగ్ బ్యూటీస్ దాదాపు ఒకేసారి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరిలో ఎక్కువగా ఆకట్టుకున్న బ్యూటీ కృతిశెట్టి. శ్రీ లీల ఫస్ట్ మూవీ పెళ్లి సందడి పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ శ్రీ లీల షైన్ అయింది. కృతిశెట్టి ఫస్ట్ మూవీ ఉప్పెనతోనే బేబమ్మగా కుర్రాళ్లకు జ్వరం తెప్పించింది. మూవీ బిగ్గెస్ట్ హిట్. కట్ ఇటు శ్రీ లీలకు ధమాకా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. కట్ చేస్తే ఇద్దరి ఆఫర్లే ఆఫర్లు. మళ్లీ కట్ చేస్తే వచ్చిన కొత్త సినిమాలన్నీ పోయాయి. ఓవర్ నైట్ ఫేమ్ అయిన బ్యూటీ ఓవర్ ద పీరియడ్ లోనే డౌన్ అయ్యారు. ఇద్దరూ నటన పరంగా ఇంకా అమెచ్యూర్ గానే ఉన్నా.. అందం, ఛలాకీతనం వల్ల అన్ని ఆఫర్స్ అందుకున్నారు. వరుస ఫ్లాపులతో ఓ దశలో ఇద్దరూ ఖాళీగా ఉన్న సందర్భమూ ఉంది.

అయితే ప్రస్తుతం శ్రీ లీల మళ్లీ వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ప్రస్తుతం తన కిట్టీలో రవితేజ మాస్ జాతరతో పాటు నాగ చైతన్య, అఖిల్ మూవీస్ ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు వచ్చినా తనే హీరోయిన్ కాబట్టి అదీ అకౌంట్ లోనే ఉంటుంది. కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గా అమరన్ తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న శివకార్తికేయన్ తో కోలీవుడ్ కు పరిచయం అవుతోంది శ్రీ లీల. ఇవే కాక ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా సెట్ అయింది. సో.. తను ఫుల్ బిజీ అయిపోయింది మళ్లీ. వీటిలో ఏ రెండు హిట్ అయినా మరో నాలుగైదు సినిమాలు వస్తాయి తనకు.

ఇటు కృతిశెట్టి పరిస్థితి మరీ దారుణంగా లేదు కానీ.. తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. కాకపోతే తమిళ్ లో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో కార్తీ సరసన నటిస్తోన్న ‘వా వాతియార్’ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. లవ్ టుడే మూవీతో తమిళ్ తో పాటు తెలుగులోనూ విజయం అందుకున్న ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని నయనతార నిర్మిస్తుండగా ఆమె భర్త విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో పాటు జయం రవి సరసన జీనీ అనే మూవీలోనూ నటిస్తోంది. సో.. ఈ మూడు సినిమాలు తన అకౌంట్ లో ఉన్నాయి. కాకపోతే శ్రీ లీలలాగా తెలుగులో మళ్లీ కొత్త ఆఫర్స్ దక్కించుకోలేకపోతోంది కృతిశెట్టి. ఈ తమిళ్ మూవీస్ హిట్ అయితే.. మళ్లీ తెలుగు ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. 

Tags:    

Similar News