తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తర్వాత శ్రీలీల రేంజే మారిపోయింది. ఇప్పటి వరకూ సాలిడ్ బ్లాక్ బస్టర్స్ అంటూపెద్దగా లేకపోయినా.. అమ్మడి జోరు మాత్రం బాగా ఉంది. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. కొందరు ఐరన్ లెగ్ అని కామెంట్స్ చేస్తున్నా.. తను మాత్రం తగ్గడం లేదు. ఏకంగా బాలీవుడ్ లో కూడా జెండా పాతేందుకు సిద్ధం అవుతోంది. అయితే ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించుకుంటోంది. ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ తో చేయాల్సిన లెనిన్ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తోంది. ఆల్రెడీ పూర్తయిన మాస్ జాతర విడుదలకు సిద్ధంగా ఉంది. అటు బాలీవుడ్ లో ఆషిఖీ 3 తో పాటు తమిళ్ లో పరాశక్తి సినిమాలున్నాయి తన చేతిలో. ఈ టైమ్ లో కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడైన అజిత్ సరసన ఆఫర్ అంటూ కొత్త వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ యేడాది విడాముయర్చి డిజాస్టర్, గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్ అందుకున్న అజిత్ మరోసారి గుడ్ బ్యాడ్ అగ్లీ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ తోనే సినిమాకు సిద్ధం అవుతున్నాడు. అజిత్ కుమార్ కు ఇది 64వ సినిమా. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ ను నవంబర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ఈ మూవీలో అజిత్ కు జోడీగా శ్రీ లీలను తీసుకోబోతున్నారు అనే వార్తలు కోలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. వీరి మధ్య ఏజ్ గ్యాప్ చాలానే ఉంది. ఏజ్ గ్యాప్ ఉన్నా రవితేజ లాంటి హీరోలతో రొమాన్స్ చేస్తోంది శ్రీలీల. అందుకే అజిత్ తో అన్నా తనకు ప్రాబ్లమ్ ఏం ఉండదు. బట్ అజిత్ ఒప్పుకుంటాడా అనేదే పెద్ద పాయింట్. ఇక ఈ చిత్రంలో మళయాల స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు. స్వాశిక ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తుందట. అనిరుధ్ సంగీతం చేయబోతున్నాడు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ మూవీని హార్బర్ నేపథ్యంలో సాగుతుందని టాక్. మొత్తంగా ఈ న్యూస్ నిజమే అయితే శ్రీలీలకు ఇది మరో బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.