Karuppu Teaser : సూర్య కరుప్పు టీజర్.. ఫుల్ యాక్షన్ డోస్

Update: 2025-07-23 05:23 GMT

తమిళ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తోన్న మూవీ 'కరుప్పు'. టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్.జే బాలాజీ రూపొందిస్తోన్న సినిమా ఇది.ఇవాళ సూర్య బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్స్ లో ఉన్న సూర్యకు ఈ మూవీ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే వైబ్ తో కనిపిస్తోందీ టీజర్.సూర్యను ఇలాంటి మాస్ కంటెంట్ తో చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్. ఆ విషయం ఆర్జే బాలాజీకి బాగా తెలిసినట్టుగా ఈ టీజర్ కట్ చేశాడు. బర్త్ డే స్పెషల్ కాబట్టి మరో ఆర్టిస్ట్ ను హైలెట్ చేయకుండా పూర్తిగా సూర్యను మాత్రమే హైలెట్ చేశాడు. డిఫరెంట్ గెటప్స్, వేర్వేరు ప్రాంతాల్లో సాగే కథలా కనిపిస్తోంది ఈ టీజర్ చూస్తుంటే. టీజర్ ఆరంభంలోనే బాలాజీ మార్క్ కాంట్రవర్శియల్ డైలాగ్ ఒకటి ఉంది. 'కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు.. మనసులో మొక్కుకుని మిరపకాయలు దంచితే రుద్రుడై దిగొచ్చే దేవుడు' అనే డైలాగ్ ఇది. అంటే గ్రామ దేవతల గురించి హైలెట్ చేస్తూ ఈ డైలాగ్ కనిపిస్తోంది. రజినీకాంత్ బాషా, సూర్య జై భీమ్, గజిని సినిమాల రిఫరెన్స్ లు బలే ఉన్నాయి.విశేషం ఏంటంటే ఈ మూవీలో సూర్య సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.అంత పెద్ద స్టార్ అయినా త్రిషకు సంబంధించి ఒక్క ఫ్రేమ్ కూడా హైలెట్ కాలేదు. ఇక డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతం అందిస్తున్నాడు. అది టీజర్ కు మరో హైలెట్ లా ఉంది. మొత్తంగా టీజర అదిరిపోయింది అనే చెప్పాలి. మరి ఈమూవీతో అయినా సూర్యకు సాలిడ్ హిట్ పడుతుందో లేదో చూడాలి. 

Full View

Tags:    

Similar News