Tamannaah: మరోసారి మెగా హీరోతో మిల్కీ బ్యూటీ.. అప్పుడు వదినగా.. ఇప్పుడు ఐటెమ్ గర్ల్‌గా..
Tamannaah: టాలీవుడ్‌లో ఓ పక్క హీరోయిన్‌గా రాణిస్తూనే.. మరో పక్క ఐటెమ్ గర్ల్‌గా మారిపోయింది తమన్నా.;
Tamannaah (tv5news.in)
Tamannaah: హీరోలంతా ఒక్కొక్కసారి హిట్ కాంబినేషన్ అనిపించుకున్న హీరోయిన్స్‌తోనే మళ్లీ మళ్లీ నటించడానికి ఇష్టపడుతుంటారు. అలాగే మెగా హీరోలు కూడా ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్‌ను రిపీట్ చేశారు. కానీ ఈ మెగా హీరో మత్రం కాస్త డిఫరెంట్ రూట్లో వెళ్తున్నాడు. ఇంతకు ముందు వదిన పాత్ర చేసిన హీరోయిన్‌తో కలిసి స్పెషల్ సాంగ్‌కు స్టెప్పులేయనున్నాడు.
అసలు టాలీవుడ్‌లో ఓ పక్క హీరోయిన్‌గా రాణిస్తూనే.. మరో పక్క ఐటెమ్ గర్ల్‌గా మారిపోయింది తమన్నా. స్టార్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసే ఛాన్స్‌ను తమన్నా ఎక్కువశాతం వదులుకోలేదు. ప్రస్తుతం తమన్నా.. చిరంజీవితో కలిసి భోళా శంకర్‌లో నటిస్తోంది. అది కాకుండా హీరోయిన్‌గా తన చేతిలో ఇతర సినిమాలు ఏమీ లేవు. అందుకే మరోసారి స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'గని'. ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ దశలోనే ఉంది. షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల గని విడుదల కూడా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం వరుణ్ తేజ్‌తో స్టెప్పులేయడానికి తమన్నాను ఒప్పించే పనిలో ఉందట మూవీ టీమ్. ఇంతకు ముందు వీరిద్దరు కలిసి 'ఎఫ్ 2' సినిమాలో నటించగా.. అందులో వరుణ్ తేజ్‌కు వదిన పాత్రలో కనిపించింది తమన్నా. ఇప్పుడు అదే హీరోతో ఐటెమ్ సాంగ్‌కు స్టెప్పులేయడం విశేషం.