Tarakaratna : జననం 1983, వివాహం 2012, మరణం 2023
అలేఖ్య రెడ్డిని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 20 ఏళ్ల వయసులోనే హీరోగా తారకరత్న తెరంగేట్రం చేశారు.;
తారకరత్న ఎన్టీఆర్ కుమారుడు మోహన్‌కృష్ణ తనయుడు. 1983 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో జన్మించారు. అలేఖ్య రెడ్డిని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 20 ఏళ్ల వయసులోనే హీరోగా తారకరత్న తెరంగేట్రం చేశారు. కాలేజీలో చదువుతున్న సమయంలోనే నటనపై ఉన్న ఆసక్తితో.. 2002లో విడుదలైన ఒకటో నెంబర్ కుర్రాడుతో ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా విజయం సాధించడంతో తారకరత్నకు వరుస అవకాశాలు వరించాయి.
హీరోగానే కాకుండా విలన్, సహాయ నటుడిగానూ నటించి విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. యువరత్న, భద్రాద్రి రాముడు, అమరావతి, నందీశ్వరుడు, మిస్టర్ తారక్, దేవినేని వంటి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అమరావతి చిత్రానికి గానూ ఉత్తమ విలన్‌గా నంది అవార్డును అందుకున్నారు. ఇటీవల 9 అవర్స్ వెబ్ సిరీస్‌లో ఆయన నటించి.. ప్రేక్షకుల్ని అలరించారు. ఇక, రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండే తారక రత్న తెలుగు దేశం పార్టీ కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనేవారు. గతంలో పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం కూడా చేశారు.