Anil Ravipudi : ఇఫికి తెలుగు సినిమాలు పెరుగుతున్నాయి - అనిల్ రావిపూడి

Update: 2025-11-28 09:00 GMT

అనిల్ రావిపూడి ‘ఇఫి’ వేదికపై సందడి చేసింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీకి ఇఫిలో అవార్డ్ రావడం పై అనిల్ తో పాటు దిల్ రాజు, ఐశ్వర్య రాజేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా తన ఆనందాన్ని పంచుకున్నారు ముగ్గురు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘గతంలో ఎఫ్ 2 టైమ్ లో కూడా ఇఫిలో రావడం ఇప్పుడు మరోసారి రావడం హ్యాపీగా ఉంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీకీ ఇఫి(ఇండియన్ పనోరమ)కి అవార్డ్ రావడం సంతోషంగా ఉంది. గతంలో 50యేళ్ల నటనకు పురస్కారం బాలకృష్ణకు పురస్కారం చాలా నచ్చింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం మూవీ పాట విషయంలో చాలా బావుంది. ఈ సారి చిరంజీవి గారితో ఓ పాట కూడా 70మిలియన్స్ రావడం బావుంది. ఈ సంక్రాంతికి కూడా చిరంజీవి గారితో మూవీ బ్లాక్ బస్టర్ వస్తుందనే నమ్మకంతో ఉంది. వెంకటేష్ గారు గెస్ట్ అప్పీరియన్స్ కూడా అందించబోతోంది. మరో యేడాది గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో చిరంజీవి గారి మూవీకి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక తెలుగు సినిమాలు కూడా నేషనల్ లెవల్లో బావుంది. తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం కోరుకుంటున్నా’ అని చెప్పాడు.

దిల్ రాజు మాట్లాడుతూ..‘56వ పనోరమ సంక్రాంతికి వస్తున్నాం మూవీకి అవార్డ్ రావడం సంతోషంగా ఉంది. గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు తెలుగు సినిమాలకు అవార్డ్స్ రావడం సంతోషం. ఓపెనింగ్ టైమ్ కు బాలయ్యకు పురస్కారం రావడం సంతోషంగా ఉంది’ అని చెప్పాడు.

ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. ‘ఫెస్టివల్ మూవీస్ కు ప్రత్యేక గుర్తింపు వస్తుంటాయి. ఇలాంటి మూవీస్ కు ఎక్కువ విజయాలు సాధిస్తుంటాయి. అనిల్ గారికి ఎఫ్2 కూడా అవార్డ్ రావడం సంతోషంగా ఉంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ పాటల విషయంలో సూపర్ హిట్ కావడం హ్యాపీగా ఉంది. వెంకటేష్ తో వర్క్ చేయడం మంచి ఫీలింగ్ వస్తుంది. ఆయనతో మాట్లాడ్డం కూడా బావుంటుంది. ఈ మూవీకి సంబంధించి మొత్తం అనిల్ గారే చేయడం వెనక కారణం’ అని చెప్పారు.


Full View

Tags:    

Similar News