అన్ని సీక్వెల్స్ ఒకలా ఉండవు అన్న మాటను నిజం చేసింది భారతీయుడు 2. దాదాపు 28యేళ్ల క్రితం విడుదలైన భారతీయుడు సినిమా అప్పట్లో అద్భుత విజయం సాధించింది. అవినీతిపై భారతీయుడు సాగించిన సమరానికి బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. ముఖ్యంగా కమల్ గెటప్ కు ఫిదా కాని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఎవరైనా హ్యాపీ. కానీ ఈ సీక్వెల్ కు సంబంధించి ముందు నుంచీ అన్నీ డౌట్సే. అప్పట్లోనే సేనాపతి చాలా ఏజ్డ్ పర్సన్. ఇన్నేళ్ల తర్వాత ఎలా ఉంటాడా అనే డౌట్స్ ను చాలామంది వ్యక్త పరిచారు. ఆ డౌట్స్ అన్నీ నిజమే అయ్యాయి. శంకర్ చూపిన అవుట్ డేటెడ్ కంటెంట్ కు ఆడియన్స్ పరమ బోరింగ్ అనేశారు. కమల్ గెటప్ కూడా నిరాశపరిచింది. దీంతో ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిందీ మూవీ. సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ కాస్ట్ కూడా వేస్ట్ అయిపోయింది. వీకెండ్ లో కూడా చాలా థియేటర్స్ ఖాళీగా కనిపించాయి. అంత పెద్ద డిజాస్టర్ కాబట్టే చాలా ముందుగానే ఓటిటిలోకి వచ్చేస్తోంది.
ఆగస్ట్ 2 నుంచి నెట్ ఫ్లిక్స్ లో భారతీయుడు 2 స్ట్రీమ్ కాబోతోంది. మామూలుగా అయితే ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైన 60 రోజుల తర్వాత ఓటిటిలో రావాలి. కానీ పెద్ద ఫ్లాప్ కాబట్టి నెలలోపే వదిలేస్తున్నారు. మొత్తంగా టాప్ హీరోలు, డైరెక్టర్ ల సినిమాలు కూడా ఇలా వేగంగా ఓటిటి బాట పడితే ఇంక ఇండస్ట్రీలు ఏం బాగుపడతాయి.